పుట:Kavijeevithamulu.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

601

సంప్రాప్తం బగుకాలంబుఁ దలంచి నారాయణుండె దైవం బని యెఱింగి మనోరథంబు సఫలం బయ్యె ననీ యీకృతి కృష్ణార్పణంబు చేసితి నది యెట్లనిన నేను విద్యాభ్యాసంబునం దగిలి కొండిక నై యుండ నొక్కనాఁడు దివంబున

చ. కలితవిశేషవస్త్రములు గట్టి హిమాంబు సుగంధ చందనం
    బలఁది వినూత్న భూషణము లారఁగఁ దాల్చి వినోదలీల నిం
    పుల మృదుశయ్య నిద్రఁ దగఁ బొందినచోఁ గనుపట్టెఁ బల్మఱుం
    దలమున గ్రమ్ము క్రొమ్మెఱుఁగుదండము రూపున నిల్చుపోల్కిగన్.

సీ. ఉరవడిఁ బ్రాగ్వీథి నుదయించు మార్తాండ, కోటి బింబచ్ఛాయ గూడినట్లు
    హరిహరబ్రహ్మల యాత్మలలో నుబ్బి, కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
    ఖరకరకరతీవ్రగతిని గరంగుచు, హేమాద్రిచెంతఁ బెల్లెగసినట్లు
    ఫణిరాజఫణరాజిమణిగణవిస్ఫూర్తి, సుషిరంపువెలి దలచూపినట్లు

    ఉట్టిపడ్డట్లు క ట్టెఱ్ఱ నూఁదినట్లు, తేజ మెసఁగoగ నామ్రోల దివ్యవాణి
    పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ, జూచి యిట్లని పలికె మంజులకము గాను.

ఉ. ఆటలు పాటలుం జదువు లద్భుతముల్ విననొప్పువాద్యముల్
    సాటి దలంపరానిబలుసాములు మున్నగువిద్య లెల్ల నీ
    కాటలుఁ బాట లయ్యె విను మన్నిటికి న్మెఱుఁ గిడ్డభంగి నా
    చాటున జాటుకారపద సాధుకవిత్వము జెప్ప మింపుగన్.

వ. అని యానతిచ్చుజగన్మాత కృపావలోకన సుశ్లోకుండనై యే నొకశ్లోకంబు నాక్షణంబ నుడివితి నది యెట్టిదనిన.

శ్లో. హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
    నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ
    సఁత్సంగ్రహాయ సగుణాయ సదీశ్వరాయ
    సంపూర్ణ పుణ్యపతయే హరయే నమో౽స్తు.

వ. ఈశ్లోకం బద్దేవి యంగీకరించె నంత మేలుకాంచి యానందభరితుండ నై నాఁటనుండి చంద్రానుగత యగుచంద్రికయుంబోలె నారాయణాంకితం లైనకవిత్వ తత్త్వజ్ఞానంబు గోచరం బయ్యె దానికి ఫలంబుగా గోపికావల్లభుని నుల్లంబున నిడుకొని.

గీ. పలుకఁ గలిగె మొదల భాగవతార్థంబు, భర్త కృష్ణుఁ డాయె భాగ్య మొదవె
   నమృతరసము గోర నమరుచింతామణి, పాత్ర సంభవించుభంగి నిపుడు.

గీ. భాగవతము తేటపఱుప నెవ్వఁడు సాలు,శుకుఁడు దక్క నరుని సఖుఁడు దక్క
    బుద్ధిఁ దోఁచినంత బుధులచే విన్నంత, భక్తి నిగిడినంత పలుకువాఁడ. "