పుట:Kavijeevithamulu.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

600

కవి జీవితములు.

నకుఁ గృత్యాది పద్యములును తన వంశవర్ణనయు తాను దానిం జేయుటకుఁ గలకారణములను కొన్నింటి వ్రాసి యుంచెను. వాని నిట వివరించుట అవసరముగావున సంగ్రహముగా వివరించెదను.

ఏర్చూరి సింగనమంత్రి

ఇతఁడు భారతశేషమును, హరివంశమును ఆంధ్రీకరించిన యెఱ్ఱాప్రెగ్గడయొక్కయో లేక కొక్కోకమనుకళాశాస్త్రముం దేనిఁగించిన యెఱ్ఱాప్రెగ్గడయొక్కయో వంశస్థుఁ డని చెప్పవలసియున్నది. ఈ విషయమైన కొంత వృత్తాంతము 3 అధ్యాయములో 60, 61. 62 పుటలలో వ్రాయఁబడినది. ఇపుడు సింగనవిషయమైన గ్రంథస్థచారిత్రము వ్రాసెదను. ఎఱ్ఱాప్రెగ్గడనుండి ఎఱ్ఱాప్రెగ్గడవారనియు పోతరాజునుండి పోతరాజువారనియు నియోగికుటుంబములు రెం డేర్పడినట్లు కాననగు. దానికి దృష్టాంతముగ నెఱ్ఱాప్రెగ్గడవారిది శ్రీవత్సగోత్రమును పోతరాజు వారిది కౌండిన్యసగోత్రము నై యున్నది. ఇదియే యథార్థమైన నీసింగనార్యుని యింటి పేరు ఎఱ్ఱాప్రెగ్గడవారు కావచ్చును. కొండవీటి సీమలోను అద్దంకి సీమలో నుండు పెకండ్రు నియోగిబ్రాహ్మణులు ఆదేశప్రభువులు లీదేశము జయించి వచ్చునపుడు వారితో వేఁగిదేశమున గోదావరీ తీరమునకు వచ్చి అచ్చటనే స్థిరపడిరి. పైకుటుంబములవారును అట్టి వారిలోనివారే కావచ్చును. కావున నిపుడు మనము వ్రాయుచున్న సింగన యెఱ్ఱాప్రెగ్గడవారికి మూలపురుషుఁడు కానోపును.

ఈసింగన తాను భాగవతముం జేయుటకుఁ గల కారణంబు నొక విధంబుగఁ జెప్పుచున్నాఁడు. అది యెట్లనిన :-

"ఉ. ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం
      బెయ్యది సమ్మనీంద్రులకు నెల్ల కవిత్వసమాశ్రయంబు ము
      న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మీరూ
      పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతార్థ మంత్రమున్.

వ. అని శ్రీ మహాభాగవత పురాణంబునందు షష్ఠస్కంధం బాంధ్రభాష విరచింపం బూని యాకృతికిం బతిగా నద్దేవుండు గలం డని వితర్కించి నాకుం గవిత్వమహత్వంబు