పుట:Kavijeevithamulu.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

599

ధములును, తచ్ఛిష్యుల భాగమునకు 6 స్కంధములును వచ్చినట్లు గఁగాన్పించు. అందు 5 పంచమస్కంధము గంగనార్యప్రణీతము. షష్ఠ స్కంధము సిం గనార్య ప్రణీతము, 11 ఏకాదశ 12 ద్వాదశ స్కంధములు వెలిగంధల నారాయణకవి ప్రణీతములై యున్నవి. ఇందు మొదటికవి గాక తక్కిన యిర్వురును పోతనార్యునియె డల గురుభక్తి గలవారుగా వారిపద్యములవలనను, గద్యములవలనను స్పష్టమగుచున్న ది. గంగ నార్యుఁడు తన వంశావళి మొదలగువానిం డెల్ప కుండుట చేత నెట్టిసంబంధము కల్గియుండునో చెప్ప వీలులేకున్న ది. అయితే ఇతఁడును పోతనామాత్యునివిధంబుననే తనగ్రంథము కృష్ణున కంకితముగా జేసెను. ఇతనివలెనే సింగనార్యుఁడును తనగ్రంథము కృష్ణున కే యంకితము చేసి రచియించెను. దీనింబక్టి చూడగా నీకవులం దఱును తమతమ భాగములు కృష్ణునకే అంకితములు చేయుటకు సిర్ల యించుకొనినట్లును అనంతరము కారణాంతరముచేత రామాంకితము గా దానిని మార్చిన నతని ప్రియశిష్యుం డగువెలింగందల నారాయణ కవిమాత్రము తాను పోతనవిధంబుగ రామనామాంకితముగనే గ్రంథము రచియించి నట్లు నూహించనై యున్నది. ఇదియునుగాక యీమువ్వురుకవుల భాగములకు నిల్చిన గ్రంథ మీంచుమించుగా పరమార్థభాగ ములో సమానముగ నే యున్నట్లు కాన్పించుచున్నది. 5 స్కంధము 30 పుటలలో ఋషభ రాజుచరిత్రమును భరతోపాఖ్యానములును ముఖ్యములు. 6 స్కంధము 36 పుటలలో అజామిళోపాఖ్యానము, హంసగుహ్య స్తవరాజము, నారాయణకవచము నున్న ది. 11 12 స్కంధలు 20 పుటలలో ఋషభకుమారుల పరమార్థోపదేశము కృష్ణం డుద్దవునకుఁ జేసినపరమార్థోపదేశము, అవధూతయదుసంవాదము నున్నది. పోతన ఇట్లుగా పరమార్థోపదేశము గల్గిన భాగము విడదీసి యొ క్కొకని కొక్కొక దాని నిచ్చి గ్రంథము పూర్తిచేయించినట్లుగాఁ గానుపించు, ఈమువ్వులో సింగన తాను రచియించిన షష్ఠస్కంధము