పుట:Kavijeevithamulu.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

595

మువలనఁ గానుపించును. అదిగావున పోతరాజుకాల మదియ కావచ్చును. అసర్వజ్ఞ సింగమనీఁడు విజయనగర ప్రభుం డగు ప్రౌఢదేవరాయల కాలీనుం డని ఆగ్రంథమందే వ్రాయఁబడినది. కావున నతని కాలీనుఁడ.

పోతరాజు బాల్య చేష్టితము.

పోతరాజు బాల్యవ్యాపారాదికములంగూర్చి పైపండితులు వ్రాసిన దెట్లనగా :-

"ఇమ్మహత్ముండు బాల్యంబునందు గోసంరక్షణార్థంబుగ స్వగ్రామం బగునేకశిలానగరంబునకు సన్ని కృష్ణపర్వతాగ్రంబున సంచరించుసమయంబున నచ్చట తనపూర్వజన్మసుకృత పరిపాకాతిశయంబునఁ జిదానందయోగీంద్రుం డనునొక ఋషిశ్రేష్టుం డతనికి దృగ్గోచరుం డైన నంత నాపోతనామాత్యుఁ డమ్మహాత్మునింగాంచి యతనిచెంతకుం జని యత్యంతభయభక్తుల నవనతశరీరుం డై యభివందనం బొనర్చి శరణుజొచ్చితినని పలుక నాతపోధనుండు బాలుం డగుపోతనామాత్యునియం దవ్యాజకరుణ నుంచి శ్రీరామ మంత్రరాజం బనుగ్రహించి తదనుష్ఠానక్రమం బశేషంబుగఁ దెల్పి కృతార్థుండవు గమ్మని తెల్పె"

అయితే భాగవతములో నిట్టివృత్తాంత మేమైనా నున్నదా యని యారయవలసి యున్నది.

పోతన గురువిషయము.

భాగవతంబున నీకథ కెంతమాత్రము నాధారము గాన్పించదు. చిదానందయోగీంద్రుండు పోతనకు గురుండే అయినచో నాతనింగూర్చి స్తోత్రము గానీ స్మరణము గానీ అం దుండకపోవునా అని తోఁచుచున్నది అ దెట్లన్న దన -

"అని యిష్టదేవతలం జింతించి దినకరకుమారప్రముఖులం దలంచి ప్రథమకవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవదనుజ కర పరిమళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సములాసుం డగువ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవతకథాసుధారస ప్రయోగికి శుకయోగికి నమస్కరించి మృదుమధుర వచనవర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి కతిపయ శ్లోకసమ్మోదిత సూరు మయూరు నభినందించి మహాకావ్యకళా విలాసుం గాళిదాసుం గొనియాడి కవికమలరవిం భారవిం బొగడి విదళితాఘు మాఘున్ భూషించి యాంధ్రకవితా గౌరవజన మనోహరి నన్న