పుట:Kavijeevithamulu.pdf/600

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
594
కవి జీవితములు.

సమ్మెటవ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్."

అను దీనిం బట్టి పోతరాజు నరకృతి నిషేదించినట్లు స్పష్టమే యగు. అయితే దీనిఁకి బూర్వమునందో పరమందోగాని యీపోతరాజు వేంకటగిరి ప్రభుం డగుసర్వజ్ఞసింగమనీని కోర్కెపై నొక దండకము చెప్పి యాప్రభునిపైఁ గృతియిచ్చినట్లు వేంకటగిరివారివంశ చారిత్రమువలనఁ గాన్పించును. అది కేవలము నిజమనుటకు నబద్ధమనుటకు మనకుఁ దగినన్ని నిదర్శనములు కానరావు. భాగవతమున నరకృతి నిచ్చుటచేఁ గల్గినమనఃపరితాపముచేతనే అయియుండు నని యూహింపవచ్చును. అట్లైన నది భాగవతమునకు ముందే అగును. పోతన కృతగ్రంథములలో నెచ్చట నది వివరింపఁబడలేదు. ఆకారణముచేత భాగవత రచనానంతరమే అని యూహింతు మనిన నదియుం బొసఁగి యుండలేదు. భాగవతానంతరము పోతనవిషయమై సింగమనీఁడు జరిగించియున్నాఁ డనినచర్యయే యధార్థమేని అపుడును భోగినీదండకము పుట్టుట కవకాశము లేదు. కావున నీగ్రంథము పోతన చేసియుండె ననుట కన్యగ్రంథసాక్ష్యము కావలసియుండును. ఆంధ్రభాగవత మచ్చొత్తించిన పండితులు దీనివిషయ మెట్లుగా వ్రాసిరో దానిం జూపెదము.

పోతరాజుకాలము.

"శాలివాహనశకసంవత్సరములు 1300 గల కాలంబుగతంబై యుండు సమయంబున ............................. వ్యాసాపరావతారుం డని పొగడొందఁదగిన సుగుణాకరుం డైనపోతనామాత్యుఁడు బమ్మెరవంశ ప్రసూతుండైన కేసనమంత్రికిఁ దనూజుండుగా జనించె. ఇది కొంచె మించు మించుగా నితని దండకమును గృతినందె నని చెప్పెడు వేంకటగిరి ప్రభునికాలముంబట్టి నిర్ణయింపఁదగియున్నది. ఆప్రభునిపేరు సర్వజ్ఞసింగమనీఁడు." అతఁడు శా. స. 1300 మున ప్రభుత్వమునకు వచ్చి శా. స. 1350 వఱకును వ్యవహరించినట్లుగా వేంకటగిరివారి వంశావళీ గ్రంథ