పుట:Kavijeevithamulu.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

592

కవి జీవితములు.

లెడలి మహనీయమంజులపులిన శోభితప్రదేశంబున మహేశ్వరధ్యానంబు సేయుచుఁ గించిదున్మీలితలోచనుండ నై యున్న యెడ రామభద్రుండు తన నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబు తెనుంగుసేయ నానతిచ్చి తిరోహితుం డయ్యె"

నని వ్రాసె. దీనిం బట్టిచూడ పోతనామాత్యునకు బహుకాలము నుండి నారాయణకథావిధానంబుల నాంధ్రీకరించు కోర్కె యున్నట్లును దానికి శ్రీరామచంద్రునియాజ్ఞయు నైనట్లును స్పష్ట మగును. లీలాశుకుఁడు మొదలగుకొందఱు శైవమత ప్రవిష్ఠులకు వైష్ణవగ్రంథరచనయందును, హరదత్తాచార్యుఁడు మొదలగు వైష్ణవమతప్రవిష్టులు కొందఱకు శైవమతగ్రంథ రచనయందును గోర్కెలు గలుగునట్లుగ నీవఱకే దృష్టాంతములు న్నవి. అటులనే పోతనామాత్యుఁడును శైవమంత్రోపాసకుం డైనను వైష్ణవకథానువర్ణనాసక్తియు తద్భక్తియు మిగులఁ గలిగియున్నట్లు స్పష్టం బగుచున్నది.

భాగవతరచనాప్రకారము.

ఇతఁడు తాను రచియింపఁబోవుభాగవతములో సంస్కృతమునకంటె అధికగ్రంథము చేర్చుటకు తనకుం గలయిష్టమును సూచించుట కీక్రిందివిధంబున నొకపద్యంబు వ్రాసెను :-

"తే. భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనఁ దమ్మిచూలికైన
      విబుధజనులవలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపఱుతు."

      ఈపోతన తన శైలింగూర్చి మఱియొకపద్యంబు వ్రా సెను :-

క. కొందఱకుఁ దెనుఁగు గుణ మగుఁ గొందఱకును సంస్కృతంబు గుణ మగు రెండున్
    గొందఱకు గుణము లగు నే, నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్.

అని పోతన తనకు బూర్వు లగుతిక్కనాదికవులందఱు పురాణాదులు తెనిఁగించినను భాగవతమును దెనిఁగించక యుండి రనియు దానిం దెనిఁగించినచో లోకము త న్నా క్షేపించెదరేమో అనుశంక మనంబున నుంచుకొని యి ట్లీ క్రిందిపద్యంబున పూర్వులు దీని దెనిఁగించకుంటకుఁ గారణము తనను దరింపఁజేయుటకుఁగా నని తెల్పెను. అదెట్లన్నను :-