పుట:Kavijeevithamulu.pdf/597

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
591
బమ్మెర పోతరాజు.

 కౌండిన్యసఁగోత్రుఁ డగు
      భీమనమంత్రి.
            |
      అన్నయ్య. (భార్య గౌరమాంబ.)
            |
      సోమనమంత్రి. (భార్య మల్లమాంబ.)
            |
      ఎల్లనమంత్రి. (భార్య మాచమ్మ.)
            |
       కేసనమంత్రి. (భార్య లక్కమాంబ.)
      (ఇతఁడు శైవశాస్త్రమతము నందెను.)
           |
   _______________
   | ____________ |
 తిప్పయ్య. పోతయ్య. (గ్రంథకర్త)

పోతనమతము శైవము.

ఈకవి సహజపాండిత్యుఁ డైన ట్లాతనిచేఁ జెప్పంబడినయాశ్వాసాంత గద్యములవలనఁ గోచరించును. అది యెట్లంటేని :-

"ఇది శ్రీపరమేశ్వరకరుణాకటాక్షకవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతము."

ఇచ్చటి పరమేశ్వర శబ్దమునకు శివుఁ డనియే అర్థము చెప్పవలసియున్నది, దీని కీతనితండ్రి శైవమతము నందె నని చెప్పినది కారణము. ఇతఁడు శైవమతస్థుఁ డై యుండుటయేకాక భాగవతమును దెనిఁగించుటకుముందుగ గంగాస్నానంబు చేసి యపుడు మహేశ్వరధ్యానంబు సేయుచున్నట్లును జెప్పెను -

పోతన భాగవతముం దెన్గించుటకుఁ గారణము.

పోతనామాత్యుఁడు తాను భాగవతముఁ దెనిగించుటకుఁ గల కారణం బీక్రిందివచనంబున నిట్లు వ్రాసెను -

"మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణకథా ప్రపంచరచనా కుతూహలుండ నై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాక గని సజ్జనానుమతంబున నభ్రంకషశుభ్రసముత్తుంగభంగ యగుగంగకుం జని గ్రుంకు లిడి