పుట:Kavijeevithamulu.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

579

స. 3. (d) "శతాంథాః కూపం ప్రవిశంతి" అను బుధజనోక్తి పుట్టుటకు గారణ మేమై యుండును. ఇటులనే యెవరో పదిమంది విచారణచేయకనే యొకరుచెప్పినా రని యొకరు, వారు చెప్పి రని మఱి యొకరు వ్యవహరించుటనుబట్టి ఆసామెత పుట్టియుండు. బ్రౌణ్యవైఘంటికుఁడును మఱికొందఱు గ్రాంధికులును భట్టుమూర్తియు రామరాజభూషణుఁడు నొక్కఁడే అని నిర్ధారణచేసిరి. ఆవిషయమైనసిద్ధాంతము త్రిప్పుట కెంతశ్రమ తరువాయి పండితుల కాయనో చూడుఁడు. ప్రస్తుతో పన్యాస సిద్ధాంతమును ఖండించుటయు నటువలె యగుఁగదా: ఇంతశ్రమ చేసినను కల్గెడుఫలము పూజ్యమునకంటె వేఱు లేదుకావున నీప్రశ్నము విడిచెదను.

పూ. 4. "కవికర్ణ రసాయనమును గృతినొందకుండఁ బెద్దన్న విఘ్నముచేసె నని రాయలు కోపించినఁ దత్కోపనివారణార్థంబు రాయలపే రిడి యాముక్తమాల్యద పెద్దనచేసె ననువాడుకయుఁ గలదు.

స. 4. "ఈవాడుకయే కల దని యుపన్యాసకునకుఁ దెలిసియున్న యెడల పై 3 (a) లోనిసీసపద్య మేల వ్రాసియుండవలయును. అది నమ్మివ్రాసియున్న యుపన్యాసకునకు దిరుగ నీనాల్గవప్రశ్నము వ్రాయుట కెడ మెట్లు కల్గును. పూర్వోత్తరసందర్భము లేనివ్రాఁతలకు సమాధానము చెప్పగమకించుటకంటె నూరకుండుట యుత్తమ మని తలచెదను.

పూ. 5. "పెద్ధన యద్వైతియై వైష్ణవమతానుసారం బగుగ్రంథంబుల నెట్లు రచియింపఁగలఁ డని యందు రేమో. విశేషపండితుఁడును అతులపురాణాగమేతి హాసక ధార్థస్మృతియుతుఁడును" వైష్ణవాచారి యగుశతగోపయతి శిష్యుండును, వైష్ణవమత దుం డగుకృష్ణరాయల పరమహితుండును నగు పెద్దనకు నీగ్రంథంబు సేయ సుకరంబుగాదె?

స. 5. ఈ పైసిద్ధాంతములో మతసంబంధ మగువిచారణఁగూడ బయలువెడలుచున్నది. ద్వైతాద్వైతశాస్త్రములలో గ్రంథములఁ జేయుట "అతులపురాణాగమేతిహాస కథార్థస్మృతియుతుఁడ" గుటంజేసి పెద్దనకు సుకరమే అని యుపన్యాసకుఁడు యోచించు. ఇదివఱ కాంధ్ర గీర్వాణములలో వేదాంత శాస్త్రాధ్యయనముం జేసిన వారిలో నద్వైత