పుట:Kavijeevithamulu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

578

కవి జీవితములు.

వాఁ డగుటంబట్టియు నిశ్చయించవలసియున్నది. ప్రస్తుతకాలములో వలెఁ దెన్గుదేశములోని అన్ని భాగముల వారును కలుసుకొనుటకుఁగాని యుత్తరప్రత్యుత్తరములు నడచుటకుఁగాని అవకాశములు లేక యుండుటంబట్టి యితరదేశపు వృత్తాంతములు విశేష విస్పష్టముగాఁ దెలియు నని నిశ్చయించుట కవకాశము లేదు. అట్టిచోఁ గృష్ణాజిల్లాలో నుండెడు నప్పకవికి మిక్కిలి సమీపములో నుండుగోదావరిజల్లాలోనివృత్తాంతములే తెలియరానిచో నిఁక కృష్ణాజిల్లాకు మూఁడునాల్గు జిల్లాలుదాఁటిన పై నుండిన విజయనగరసంస్థానములోని కథాసూక్ష్మములు స్పష్టముగాఁ దెలియు నని యెట్లూహింపఁగలము. గోదావరిజిల్లాలోని వృత్తాంతము తెలియ దని చెప్పియున్నారము. ఆమాట ప్రస్తావరీతిం జెప్పినది కాదు. అతఁడు రాజనరేంద్రునిఁగూర్చియు నన్నయ్యభట్టుంగూర్చియువ్రాయుచు నీక్రిందివిధమున వ్రాసె :-

"ఉ. ఎన్నగ నన్న యాఖ్యకవి యీకలి కాదినిఁ జెప్ప దాని భీ
      మన్న హరించెఁ గ్రమ్మర మహాత్ముఁడు రాజనరేంద్రుపట్టి దా
      మొన్న నొసంగె విప్రునకు మూలమతం డొనరించెఁ డీక నా
      కన్నది మున్ను విన్నదియుఁ గాదు మహాద్భుత మబ్బె నా కిటన్."

దీనిలోని 'కలి కాదిని' అనుదానికి వేఱర్థము లేనందుల కప్పకవీయము రెండవ యాశ్వాసప్రారంభములో నతనివలన మఱియొక పద్యములోఁ జెప్పంబడియెను. అదియెట్లన్నను :-

2. "క. అవధారు శబ్దశాసనుఁ, డవనిఁ గలియుగమున కాది నారాజమహేం
         ద్రవరంబునఁ జెప్పిన యాం,ధ్రవచోవ్యాకరణసూత్రతతిఁ దెనిఁగింతున్."

అని వ్రాసియుండె. దీనింబట్టి అప్పకవికిఁ గలదేశ కాలవిజ్ఞానము యొక్క సిద్ధాంతసామర్థ్యము బోధకాకపోదు. కావున నప్పకవి చెప్పినాఁ డనుమాత్రమున నితరసందర్భము లేనిచో నతని సిద్ధాంతము సుత రాం అంగీకరింపఁగూడదు.

పూ. 3. (d) "బ్రౌణ్యనైఘంటిక పీఠికయందు, విష్ణుచిత్తీయము (ఆముక్తమాల్యద) పెద్దనచేసిన దని వ్రాయఁబడినది. ఈరీతిగ నే ఆముక్తమాల్యదావ్యాఖ్యాత యగు రామశ్వామిశాస్త్రులు పీఠిక యందు వ్రాసియున్నారు.