పుట:Kavijeevithamulu.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

574

కవి జీవితములు.

నాకలలో నొక్కనాఁడు గాన్పించి, యేకతంబునఁ గూర్చి యిట్లనిపల్కె.
నాకూర్మిసోదర నరసింహ నీవు, చేకొని ద్విపదగాఁ జేసినయట్టి.
అనుపమ విష్ణుమాయానాటకమున, కనురూప విభుఁ డెవ్వఁ డని తలంచెదవు.
దానికి విభుఁడు సీతామనోహరుఁడె, రసికత నుత్తరరామాయణంబు.
పొసగ నే రచియించి భూవలయమున, వెలయించు టెఱుఁగవే విడువక భక్తి.
సంధ్యాదికృత్యంబు (ఇక్కడ జ్ఞప్తి వచ్చినది)
లొనరించి హితగోష్ఠి నుండి శీఘ్రమున, ననఘుని పుష్పగిర్యప్పన్నతనయు
ఘను సంస్కృతాంధ్రైకకవనాతిదక్షు, మాయన్న సఖుని తిమ్మకవిఁ గృతిస.
హాయునిఁ బిలిపించి యమ్మేటితోడ,నాకన్న కలఁ దెల్పినను సంతసిల్లె."

అని యున్న దానింబట్టి యుత్తరరామాయణము పాపరాజప్రణీతమే యనియు, నపుడు సహాయ మొనరించిన పుష్పగిరి తిమ్మన యనుపండితుఁడే పాపరాజు గతించినపిమ్మటగూడ జీవించియుండి అతనితమ్ముఁడగునరసింహకవి యీ ప్రస్తుతగ్రంథ మగువిష్ణుమాయావిలాసనాటకముం జేయునపుడుగూడ సహాయ మొనరించె నని యుండుటచేతఁ గంకంటిపాపరాజు రచించినగ్రంథము నీపుష్పగిరితిమ్మన సరిచూచెనుగాని ఆగ్రంథము తాను రచియించి పాపరాజుపేరిటఁ బ్రకటించియుండ లేదనియు న ట్లనుట అయుక్తమనియుఁ దేలినది.

పూ 3 (a) ఈక్రిందిపద్యము పైయభిప్రాయమునకు బలీయము

"సీ. కృష్ణరాయలపేరు నిడి నీవు రచియించి, తివి తొల్త విష్ణుచిత్తీయ మనఁగ
     కాఠిన్య మర్థంబు గాహ్యంబు గాదు సా,ధారణుల కని భూధవుఁడు బలుకఁ
     దరువాతమనుచరిత్రము నొనరించి తు,త్తమ కావ్యము మహాద్భుతముగఁ బిదప
     బెక్కు కావ్యంబులు పెం పెక్క విరచించి మంటివి రాజసమ్మానమునను
     భంగ మందిన యలరామలింగముఖులు, సాటి రాఁగ వారె నీతోటి నౌర
     యాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దనార్యవిశేషవివేకధుర్య." చాటువు.

న. 3. షబాషు! ఇంత విశేషాధార ముండఁగ నిఁక ఆముక్తమాల్యదకుఁ బెద్దన యేల కవి కాకుండును? ఆంధ్రకవిత్వమహత్తును దెలియఁగోరువా రిట్టిపద్యముల నాదరింపవలెఁగదా ! అని ఆశ్చర్యసాగరమున మున్గుటకంటె నీపద్యమునకుఁ జెప్పవలసిన సమాధానము ప్రధాన