పుట:Kavijeevithamulu.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

573

పుష్పగిరి తిమ్మన కవిత్వవిశేషము లతని సమీరకుమారవిజయములోఁ జూడఁదగు. పుష్పగిరితిమ్మన కవిత్వమునకు నీకంకంటిపాపరాజు కవిత్వమునకును అల్లసాని పెద్దనకవిత్వమునకుఁ గృష్ణరాయనికవిత్వమునకుఁ గలభేదమే యున్నది. ఆయుభయులలోఁ బుష్పగిరితిమ్మన, యల్లసాని పెద్దనలు కేవలము కవిత్వవృత్తినే జీవించువారు. ఈపాపరాజును గృష్ణరాయలును రాజకీయవ్యవహార నిమగ్ను లైయుండి విద్యావినోదంబులు చేయువారై యుండిరి. ఆకారణమునఁ బై యిర్వురికవుల సహాయము నీయిర్వురు పండితప్రభువులకుఁ గావలసివచ్చెను.

ఈప్రభువు లిర్వురును వ్యాపారాంతముల నుండువారుకావునఁ గవిత్వవ్యాసంగము చాలినంత చేసియుండకపోవచ్చును. ఆకారణమున నచ్చటచ్చట వ్యాకరణములోని మెఱుగులఁ దేలేక పోవచ్చును అట్టిలోపములను పైకవులిర్వురును సాధ్యమగునంతవఱకు సవరించియుందురు. అట్లున్నను మార్చుటకు వీలులేనియంశములుగాని దిద్దునపుడు మఱిచియున్న యంశములుగాని గ్రంథములయందుఁ జూపట్టి, ఆకవులకవిత్వము లాగ్రంథములు కావనుటకు సాక్షిభూతముము లైయున్నవి.

ఇఁక కంకంటిపాపరా జుత్తరరామాయణము మను గ్రంథముంజేసి యుండెనా లేదా యనుదానినిస్థిరపఱచుట కాతనితమ్ముం డగునరసింహకవి రచియించినవిష్ణుమాయావిలాస నాటకము నుండి కొన్ని వాక్యము లుదాహరించెదము ఎట్లన్నను :-

ద్విపద.

"ఈవిశ్వహితకృతి కేవేల్పు నధిపుఁ, గావింతు నని యాత్మ గణియించునపుడు,
  ఆర్వేలవంశాబ్ధి హరిణలాంఛనుఁడు, గర్వితరిపుమంత్రి గర్వభంజనుడు.
  గురుతరశ్రీవత్స గోత్రపావనుఁడు, పరిలబ్ధమదనగోపాలభావనుఁడు.
  ప్రపితామహునివల్లభప్రభుఁ బోలి, యెపుడు బంధులఁ బ్రోచుహితకీర్తిశాలి.
  కంకంటియప్పయాగ్రణి కుమారుండు, మాయన్న నరసమాంబాగర్భశుక్తి.
  కాయతమౌక్తికం బగుభవ్యశుక్తి, వరవర్ణ్యు వేంకట నరసింహుఁగన్న.
  పరమపుణ్యుఁడు దయాపరులలో మిన్న, సరసుండు పాపరాజప్రధానుండు.