పుట:Kavijeevithamulu.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

570

కవి జీవితములు.

పైయుపన్యాసమునకు సమాధానము.

ఇట్టి యుపన్యాసము కవిజీవిత గ్రంథకర్త నగునాకొఱ కుద్దేశింపఁబడినను నెల్లూరునం దుండుపత్త్రికకుఁ బంపఁబడుటంబట్టి దాని ప్రకటన సంగతియే కొంతకాలమువఱకు నాకుఁ దెలియలేదు. అనంతరము మఱి కొంతకాలమునకు నముద్రితగ్రంథచింతామణి పత్త్రికాధిపతి తమ చింతామణి మయూఖములు చేర్చిన సంచిక యొకటి కార్యాంతరముపై నాకుఁ బంపఁగా దానిం జూచుచుండి పైయుపన్యాసముం గాంచితిని. అప్పటికిఁ గాలాతిక్రమణమై యుండుటంబట్టియు నాకవిజీవితములు రెండవకూర్పునకుఁ దిరుగ సిద్ధము చేయంబడుటఁబట్టియు వెంటనే నాయభిప్రాయముఁ బ్రకటింపనైతిని. ఇపుడు కృష్ణరాయచారిత్రము ప్రకటించుచున్నాఁడను గావునఁ బైయాక్షేపణలకు సమాధానము వ్రాయక విధిలేకవచ్చినది. కావున దాని నీక్రింద వివరించెదను. ఎట్లన్నను.

(1. పూర్వపక్షము.)

ఈగ్రంథము నిక్కంబుగఁ గృష్ణరాయనికృతంబేని రాయం డసమర్థుం డనియు, నాముక్తమాల్యదాకారుండు కాఁ డనియుఁ బెద్దనయే రచియించి రాయలపేరు పెట్టె ననియు నిట్టియపవాద పుట్టుటకుఁ గారణంబు కానరాదు. భోజరాజకృతంబు లగుప్రబంధాదులను గాళిదాసు చేసె నని యనిరే. ఇట్టిపట్టుల నబద్ధంబు పుట్టదని దిట్టంబుగ జెప్ప నొప్పు.

1. (సమాధానము.)

పెద్దన కృతము లగుపద్యములు కొన్ని మనుచరిత్రలోనివి ఆముక్తమాల్యదలోఁ గానుపించుచుండుటం జేసియు పైయపవాదకుఁ గారణ మని చెప్పితిమి. అట్టిది కా దనుట కేమికారణముచెప్పిరో తెలియదు. భోజునిముఖము చూచు వారందఱును కవు లవుదు రని ప్రతీతి యుండుటబట్టిం భోజుఁడు దాఁటుకొనిపోయెను. కాని లేకున్న భోజకృత గ్రంథంబులును గాళిదాసాదిమహాకవికృతము లని లోకప్రతీతి యేల