పుట:Kavijeevithamulu.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

568

కవి జీవితములు.

1. ఈగ్రంథంబు నిక్కంబుగఁ గృష్ణరాయకృతం బేని సర్వజనోపకారియు రాజ్యాధి కారియుఁ గవిజనజీవనాధారకారియు నగురాయం డసమర్థుం డనియు నాముక్తమాల్యదకారుండు కాఁ డనియుఁ బెద్దనయె రచియించి రాయలపేరుబెట్టె ననియు నిట్టి యపవాద పుట్టుటకుఁ గారణంబు గానరాదు. భోజరాజకృతం బగుచంపూ ప్రబంధాదులను గాళిదాసుండు చేసె ననిరే. ఇట్టిపట్టుల నబద్ధంబు పుట్ట దని దిట్టంబుగఁ జెప్ప నొప్పు.

2. లోకంబులో నొకరు గ్రంథంబుఁ జేసి మఱియొకరి పేరుఁ బెట్టుట సర్వసాధారణంబుగా నున్నదిగదా. ఇందుకుఁ బెద్దిభట్టు చేసినవ్యాఖ్యానంబులును పుష్పగిరితిమ్మన కృతం బగుదశావతారచరిత్రము నుత్తర రామాయణంబును దార్కాణంబులు గావున "ఇట్లు హీనకార్యంబునకు లోఁబడి కృష్ణరాయం డబద్ధంబుల నాడించుకొని పండితుల మొగంబు లెట్లు జూచు నని సంశయంబు వొడమెడిని" యనునది సహేతుకంబుగ నుండలేదు.

3. ఈక్రిందిపద్యంబులు, పైయభిప్రాయంబునకు బలీయంబులు.

(a) సీ. కృష్ణరాయలపేరు నిడి నీవు రచియించి,తివి తొల్త విష్ణుచిత్తీయ మనఁగఁ
         గాఠిన్య మర్థంబు గ్రాహ్యంబు గాదు, సాధారణుల కని భూధవుఁడు బలుకఁ
         దరువాత మనుచరిత్రము నొనరించి తు,త్తమకావ్యము మహాద్భుతముగఁబిదపఁ
         బెక్కు కావ్యంబులు పెం పెక్క విరచించి, మంటివి రాజసన్మానమునను

తే. భంగ మొందిన యలరామలింగముఖులు, సాటిరాఁగలవారె నీతోటి నౌర
    యాంధ్రకవితాపితామహ యల్లసాని, పెద్దనార్య విశేషవివేకధుర్య. (చాటువు)

(b) పాండురంగవిజయమునందలి "ప్రౌఢదీర్ఘ సమాస" పదముఖసీసమునందు ద్వితీయచరణము.

"దానితల్లిగ నల్లసానిపెద్దన, చెప్పె మది దుది దప్పి యాముక్తమాల్య, దూ"

(c) అప్పకవీయమునందుఁ బ్రథమాశ్వాసాంతమున "ఆంధ్రకవితాపితామహుఁడు కొనియె ననుటకుఁ గొనె నని చెప్పె" నని అప్పకవివ్రాయుచు నుదాహరణంబుగ విష్ణుచిత్తీయమునందలి "పూనిముకుందునాజ్ఞఁ గను బొమ్మనె గాండివి" యను పద్యంబు వ్రాసె.

[దీనినిఁబట్టి చూడ నాముక్తమాల్యద పెద్దనార్యకృతం బని యప్పకవియభిప్రాయము]

(d) బ్రౌణ్యవైఘంటిక పీఠికయందు విష్ణుచిత్తీయము [ఆముక్తమాల్యద] పెద్దన చేసిన దని వ్రాయఁబడినది. ఈరీతిగనే ఆముక్తమాల్యద వ్యాఖ్యాత యగురామశాస్త్రుల వారును[1]

  1. వావిళ్ల. రామస్వామిశాస్త్రులు పీఠికయందు వ్రాసియున్నారు.