పుట:Kavijeevithamulu.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

567

అని యీపద్యముం జదివి కేవలము మత్స్యములు తినువాఁడును, అందులోఁగూడ రాజభోగ్యముగా దానిని పచనముచేయువిదములం దెలిసినవాఁడుగాని యిట్టిఅపరూపవర్ణనలు చేయంజాలఁడు. కావున నీ యాముక్తమాల్యద పైలక్షణములు గల్గినక్షత్త్రియుని వలనఁగాని లేక అతనికి సమానుఁ డగుమఱియొకవర్ణాంతరునివలనఁ గాని రచియింపఁ బడవలయునుగాని అట్టిమత్స్యభుక్కులు కానిబ్రాహ్మణు లగుపెద్దనాదులవలన రచియింపఁ బడఁజాలః దని నిష్కర్షించి చెప్పెను.

మా పైసిద్ధాంతములపై వచ్చిన పూర్వపక్షములఖండనము.

కొంతకాలముక్రిందట నముద్రితగ్రంథ చింతామణి కొకరిద్దఱు బుద్ధిశాలురు పెద్దనామాత్యుఁడే ఆముక్తమాల్యదను రచియించినకవి యని కొన్ని జాబులు పంపిరి. వానికిఁగూడ సమాధానములు చెప్పక పై యంశమును సిద్ధాంతీకరించితి మనఁగూడదు గావున వాని నీక్రింద వివరించి చూపెదను. ఎట్లన్నను :-

అముద్రితగ్రంథచింతామణి. సంపుటము. 2

7 నెంబరు సంచిక అ 1886 సం. డిసంబరునెల.

శ్రీమదముద్రితగ్రంథ చింతామణి పత్త్రికాధిపతిగారి సమ్ముఖమునకు.

మీపత్త్రికాచంద్రముపై నేనీక్రిందఁ బొందుపఱుచు చందంబు మందంబైనను మీకు నందించినందుకు నా డెందంబు సందియంబు బొందెడి.

సీ. శ్రీపూండ్లకులరామకృష్ణయార్యోడయ, ర్వీరనాగయకవివీరపత్త్రి
    కా మణ్యముద్రితగ్రంథచింతామణి, చింతామణియుఁబోలె సంతతోన
    శించు నని నిరాశ జేసికొన్న ప్రబంధ, ముల నుద్ధరించుచు మోదములగ
    హృద్యంబు లగుననవద్యపద్యముల, నభేద్యసమస్యల గద్యములను

తే. గీ. గలిగి సత్కవిజీవితములనుగూడ, సంశయాంశస్థలంబులఁ జాటుచుండి
        సింహపురమున వెలువడి సింహ మగుచు వెలయుచుండెడుకాకవిద్విపములకును.

ఇందుఁ బొందుపఱుచుదాని మీపత్త్రికయందు ముద్రించి తావశాభిప్రాయంబు నియ్యఁ గోరెద.

ఆముక్తమాల్యద పెద్దనార్యకృతంబు కా దనియుఁ, గృష్ణరాయకృతంబే యనియుఁ గవిజీవితకా రా ద్యాధునికుల యభిప్రాయం బై యున్నది. ఈదిగువను గనుపఱిచిన కారణంబులచే నయ్యది సరి యని నేఁ దలంపఁజాల.