పుట:Kavijeevithamulu.pdf/570

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
564
కవి జీవితములు.

అని ఇందలి కొఱవిశబ్దము రెండర్థములు గలది. ఒకయర్థము కాలి చల్లారినకఱ్ఱ. రెండవయర్థము కురువక వృక్షము. కురువకవృక్షభవ మగునపుడు గురు రేఫం బుండవచ్చునా యని యొక యాక్షేపణ. ఏమనిన సంస్కృతంబున గురురేఫములు లేవు. తద్భవంబులకుఁగూడ నెచ్చోటను నున్నట్లు గానరాదు. "తద్భవంబుల శకటరేఫ ముండకూడదు" అని కవి సంశయవిచ్ఛేదము. దీని నూహించి ద్వి రేఫవర్ణ దర్పణకారులు నాముక్తమాల్యదలోని శ్లేషరచనవలనను లఘువుగ దీనికిఁబ్రయోగంబు గానరాకుండుటంజేసియు గురువుగ నిర్ణయింపవలసి వచ్చినట్లు చెప్పి యుండిరి.

ఇంతియ కాక యీగ్రంథంబున నచ్చటచ్చటఁ గొన్ని వ్యాకరణ స్ఖాలిత్యంబులుగూడఁ గాననయ్యెడి. వీనిం బట్టి యూహించిన నీగ్రంథంబునకుఁ పెద్దన కృతికర్త యెట్లగు నని తోఁచకపోదు. వానినన్నిఁటి నిట నగపఱుచుట గ్రంథవిస్తర కారణము గావున నేదేని నొకదానిం జూపి ముందువృత్తాంతంబు నుడువుదము.

4. చ. అడుగున నుండియు న్బదిల మై చదలంటెడుకోట, నొప్పు ప్రో
        ల్చెడినికడంకదంచనపుచెతుల గంగను కాసె దూఱు గా
        నడుమున యున్కిఁజేసి యలనాకపురి న్సరికై పెనంగి లా
        వెడలఁగఁ బట్టి వ్రేయుటకు నెత్తెననం జను మల్లుపోరునన్.

ఇందు గంగను కాసె యనుచో సంధి విచార్యము "బహుళ గ్రహణముచేత స్త్రీవాచక తత్సమ సంబోధనాంతములకు సంధిలేదు. గంగను కాసె నెల తిచ్చె నని యాధునిక ప్రయోగంబులు గాన్పించు. వీనికిఁబూర్వ కావ్యంబులఁ బ్రయోగంబులు మృగ్యంబులు. అని బాల వ్యాకరణము. ఇంకనుఁ గొన్ని ప్రయోగంబు లిట్టివే యచ్చటచ్చట గాన నయ్యెడి. పెద్దనయే యీ యాముక్తమాల్యదకును మనుచరిత్రమునకును గవియైన రెండవగ్రంథం బగుదీని రచించుతఱి నెక్కుడనుభవము గల్గియుండునా. లేక మొదటరచించిన మనుచరిత్రంబున కెక్కుడనుభవము గల్గియుండునా? రెండవగ్రంథంబును రచించుఱి నే యని సర్వసామాన్యముగఁ