పుట:Kavijeevithamulu.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

563

కొన్ని యిర్వురకు సహజంబు లవుటంజేసియు అక్కడక్కడ పెద్దన్న పద్యంబులు కొన్ని యిం దుంటంజేసియు నీగ్రంథమునకుఁ గూడఁ బెద్దన యే కవి యని భ్రమగలుగుచున్నది. పెద్దన కృతం బీగ్రంథము కా దనుటకు దృష్టాంతములు పెక్కులు గలవు. అందు ముఖ్యమైనది రేఫ శకట రేఫల మైత్త్రి సమ్మతము. ఇది యీగ్రంథంబులోఁ దఱుచుగఁ గాన నయ్యెడి. దీనికిఁ గొందఱు లాక్షణికులు కొన్ని విధంబులుగను మఱికొందఱు మఱికొన్ని విధంబులుగఁ జెప్పుదురు. ఈగ్రంథంబు నందే కొన్ని ప్రయోగములు గాన్పించుటంబట్టి ఆశబ్దములకు ద్వైరూప్యము లున్నట్లు కొందఱులాక్షణికుల మతము. తొల్లిటి యాంధ్రగ్రంథంబులలో నిట్టివానికి ద్వైరూప్యములు కానరావు గావున నీకవికూడ వీని మైత్త్రికి సమ్మతించినవాఁడే యని మఱి కొందఱిమతము. అందుఁ గొన్నింటి నిచ్చట వివరింతము - "ఆముక్తమాల్యదా కారుండు లఘు రేఫములుగఁ బ్రయోగించిన వాని నితరకవు లట్లు ప్రయోగింప కుండుటచే నతఁడును లఘ్వలఘు రేఫములకు మైత్త్రి చెప్పిన వారిలోఁ జేరినవాఁడని యెంచుట యుక్తము. శైలి లోనగువానిఁ బట్టి చూడ నాముక్తమాల్యద చేసినాతఁడు పెద్దన కాఁ డని దృఢముగా దోఁచుచున్నయది. పెద్దనకవి రచితగ్రంథంబులోని పద్యంబులు కొన్ని యం దున్న వని చెప్పవచ్చెదరేమో దానికిఁ గారణాంతర మేదేని యుండనోవు." నని యలఘుకౌముదికారుల యభిప్రాయంబు. ఇంతియ కాక : -

6. "సదన మిఁ కొక్క మా టరసి చంచలలోచనఁ గానకున్న దూ,
      రెదు మఱి కాని బుద్ధి విపరీతతఁ బొందక చూడుమా"

"అనుదానిలో దూఱు" లఘు రేఫము గలదిగఁ బ్రయోగించినందులకుఁ దిమ్మకవి యాక్షేపించినాఁడు.

2. చ. తరుణులకౌఁగిట న్నునుచుఁ దమ్ము వృథా విరు లెత్తుచేసి మో
        పరులుగఁ జైత్రుడంచుఁ దదభావమనోభవవహ్ని వేల్చి ని
        ర్భరమదుపాళి ధూమము బరాగపునీరును దేనె కట్టి చా
        దరుదుగఁ దాల్పగాఁ గొఱవు లై యెఱుఁగంబ డెఁ గొన్ని భూజముల్.