పుట:Kavijeevithamulu.pdf/568

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
562
కవి జీవితములు.

ము వదల లేకపోయెను. ఇఁక నాముక్తమాల్యదాకారుఁడో ప్రారంభమునందే వైష్ణవమతానుసారముగ స్తోత్రపాఠంబులు చెప్పెను. కథా సందర్భములోఁగూడ భాగవత ధర్మబోధక మైనదాని నెత్తుకొనియె. దీనికి నాలవయాశ్వాసంబులోని యామునాచార్యవర్ణనంబునం గలవైష్ణవమతసాంప్రదాయంబు లే దృష్టాంతములు. ఇతర మతస్థులచే నిది రచింపఁబడిన వైష్ణవభక్తియుఁ బ్రపత్తియుఁ జూపుటకుఁ దగిన వచోధోరణిచేఁ బ్రకాశించుట గడుదుర్లభంబు. కావునఁ దన్మతస్థుఁ డొకఁడు వ్రాసెననుటకు సందియంబు లేదు. కృష్ణరాయండుతాతాచార్యుల శిష్యుండనియు, విశిష్టాద్వైతి యనియు జగత్ప్రసిద్ధి గలదు. ఈతం డీగ్రంథమును రచించె ననుటచే నివియన్నియు నీతనికడ నన్వయించు.

5. రాజులకుం గలసామర్థ్యాతిశయంబు సమీపవర్తు లగుపండితులమూలముగ నూహింపందగియుండు. జగత్ప్రసిద్ధు లగునష్టదిగ్గజంబులు నీతని యాస్థానపండితులేగద. వారివారికవననైపుణింజూచి యొక్కకతఱి నెక్కుడుగ సంతసించి విశేషబహుమతుల నిచ్చుచుండె ననియు, విద్యల భోజుం డనియు విఖ్యాతి గలదు. ఇట్లు భోజునిఖ్యాతి గలిగి యున్నాఁ డని నుడివినచో భోజకృతగ్రంథంబులు కాళిదాసకృతంబులని యేరైన ననుచుండిరా. రాజును ప్రసిద్ధుఁడైన కవి యయ్యెనేని యట్టి మాటలు పుట్ట వని యనవచ్చు. ఈ రాజు లిర్వురును బ్రసిద్ధులైనకవులే. అందు భోజునకు నాతని ముఖంబు చూచువారెల్ల కవులయ్యెదరని వాడుక గలదు. కావున భోజుండు కవియవుటకు సందియ ముండదని యొప్పికొనిరి. కృష్ణరాయల కట్టి విఖ్యాతి లేదు గావునఁ గవి యని సందియంబుపడకుండ సమ్మతింపరైరి. పెద్దనకృష్ణరాయ లుత్ప్రేక్షోపమస్వాభావోక్తులఁ గవనంబు నుడువువారును గఠినవచోధోరణిగలవారును గావున వీరిభేదంబు నరయుట దుర్ల భం బై యుండు. పెద్దనకుఁ బండితఖ్యాతి విశేషంబుగ నుంటం జేసియు నాముక్తమాల్యదలోఁ గొన్ని ప్రౌఢ కల్పన లుండుటంజేసియు మనమీవఱకుఁ దెల్పిన సమానప్రజ్ఞలు