పుట:Kavijeevithamulu.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

561

నం బగు నని యెంచి వాని నం దుంచుట కెంతమాత్రము నుద్యోగించియుండఁడు. అ ట్లుంచెననుటకుఁ గారణంబును వినము. అతండు క్రొత్తవాని రచించు సామర్థ్యంబు లేమింజేసి వీనినే యం దుంచెనా లేక యివియ లోకంబులోని పద్యములలో రమణీయంబు లనియుంచెనా ? మఱియొకరు పెద్దనకానివారు వీని నిందుంచినా రని యూహించుట యుక్తమై కానవచ్చుచున్నది. పెద్దనపద్యంబు లిం దుండుటం జేసియే యిది యాతని కృతి గా దని కంఠోక్తిగాఁ జెప్పుటకు హేతువైయున్నది గాని యాతనికృతంబే యనుటకుం గాదు. వంశావళి పద్యంబులు కాని వింకొకగొన్ని యం దున్నట్లు మనకుఁ గాన్పించు. అవి పెద్దనపై గ్రంథకర్తకుం గలగౌరవమును సూచించుటకుఁగాఁ గైకొనంబడియె నని యూహించుట యుక్తము.

4. గ్రంథంబున నున్నకథంగూర్చి కొంత యాలోచింతము. వైష్ణవ మతానుసారంబుగ గ్రంథారంభం బున్న యది. కథయు వైష్ణవసంబంధ మైనదే. వైస్ణవధర్మంబులును, తద్రహస్యంబులును, దత్సంబంధేతిహాసంబులు నున్నయవి. కావున నీగ్రంథంబు వైష్ణవమతావలంబకునిచే వ్రాయఁబడిన ట్లూహింపఁబడుచున్నది. పెద్దన స్మార్తుఁడేయని యాతని మనుచరిత్రారంభస్తోత్రపాఠంబులచే నూహింపనయ్యెడి. అయిననేమి పెద్దన పైగ్రంథము రాజుపేరిటఁ బ్రకటించఁ దలఁచెగావున నాతనికి నిష్టం బగు వైష్ణవమతానుసారంబుగనే రచించె నని చెప్పవచ్చు. కాని పెద్దన కీయభిప్రాయంబు మొదటనుండియు నుండినట్లు కానరాదు. ఉండుటకుఁ గూడ ప్రసక్తిలేదు. అనంతర మొక వేళ గ్రంథంబు మార్చుటకుఁ బెద్దన కిష్టంబున్నఁ గృతిముఖంబు మాఱుప యత్నించుఁగాని కథగూడ మాఱుపఁదలఁచఁడుగదా.

కావున వైష్ణవుండే వ్రాసె నని తోఁచెడిని. పెద్దన తాను శఠగోపాచార్యశిష్యుఁడ నని మనుచరిత్ర కృతిముఖమునఁ జెప్పియున్నను స్మార్తులలోని వాఁడే యవుటంజేసి కృతిముఖములోనే స్వమతాచార