పుట:Kavijeevithamulu.pdf/566

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
560
కవి జీవితములు.

సీ. పలికి తుత్ప్రేక్షోపమలజాతి పెంపెక్క, రసికు లౌనన మదాలసచరిత్ర
    భావధ్వనివ్యంగ్యనేవధి గాఁగ జె, ప్పితివి సత్యావధూప్రీణనంబు
    శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి, సకలకథాపారసంగ్రహంబు
    శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితిసూక్తి, నైపుణిజ్ఞాన చింతామణికృతి

తే. మఱియు రసమంజరీ ముఖ్యమధురకావ్య, రచన మెప్పించికొంటి గీర్వాణభాష
    నంధ్రభాష యసాధ్యంబె యందునొక్క, కృతినినిర్మింపుమిఁకమాకుఁ బ్రియముగాఁగ.

అని పల్కి యాముక్తమాల్యద రచించుమని భగవంతుండాజ్ఞయొసంగి, అంతర్హితుండైన నిద్రమేల్కాంచి నిండోలగం బుండి విద్వజ్జనుల కత్తెఱం గెఱింగించిన వార లాస్వప్నఫలంబు విప్పి సెప్పి యఖర్వమహిమాతి ధూర్వహుం డగుతుర్వను వంశంబునం బుట్టిన నీ కిట్టి శోభనంబు లే మద్భుతంబు లవధరింపు మని యాతనివంశప్రణాళిక పెద్దనచే మనుచరిత్రంబున వర్ణింపఁబడినరీతిఁ జదివి.

తే. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప, రాజపరమేశ్వరార్థదుర్గానటీశ
    సాహితీసమరాంగణ సార్వభౌమ, కృష్ణరాయేంద్ర కృతిని నిర్మింపు మనిరి.

అని పండితులు తనకు నాజ్ఞయొసంగఁ దా నాకృతిని నిర్మించితి నని కృష్ణదేవరాయండు చెప్పిన ట్లున్నయది. మనము తొంటిపల్కులఁ బాటించిన నిది యంతయు బూటకంబు గా వలయు. గ్రంథంబు రచియింప నసమర్థుం డై యొరులచేఁ జేయంబడిన గ్రంథమందుఁ దనపే రుంచ నుంచువాఁడు తాఁ బూర్వ మనేక గ్రంథంబులు రచించినట్లు చెప్పించు కొనుటచేఁ గల్గెడులాభ మపహాస్యంబుకంటె వేఱుండదు. తొంటి సంస్కృతాంధ్ర కవులు స్వకృత గ్రంథంబుల నితరులపేరు లిడునపు డబద్ధము లిట్లాడుట లేదు. ఇట్టిహీనకార్యంబునకు లోఁబడి కృష్ణరాయం డబద్ధంబుల నాడించుకొని పండితుల మొగంబు లెట్లు చూచె నని సంశయంబు వొడమెడిని.

3. ఇంతియకాక పెద్దనయే దీనింగూడ రచించి రాజుపేరిటం బ్రకటింపఁ దొరకొన్నఁ దా నా వఱకు మనుచరిత్రంబునఁ జెప్పినపద్యంబుల దీనియం దుంచ నితరులు స్వకృత మని యెఱింగిన రాజునకుగ్రౌరవహీ