పుట:Kavijeevithamulu.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

559

బుల రీతులు నేర్పఱిచి యాంధ్రకవితా పితామహుం డని బిరుదందె. పిమ్మట లక్ష్యగ్రంథంబుగ మనుచరిత్రంబు రచియించి స్వసామర్థ్యంబు సూపె. ఇట్టిపని యీతనికిం బూర్వు లగు నన్నయభట్టారక ప్రముఖ పురాణ కవులును శ్రీనాథప్రముఖ కావ్యజ్ఞులును జేసియుండరైరి. కావున నీతనికి విశేషసన్మానంబు గలిగె. ఇట్టి యుత్తమోత్తమ మగుగౌరవమును బొందినయాతండు రామరాజభూషణుఁడు వసుచరిత్ర రచించె నను నీర్ష్యచే నతనికంటెను గౌరవంబు వడయ నింకొక ప్రబంధంబు వ్రాయ నుద్యోగించినాఁడను మాట యుక్తియుక్తముగ నుండలేదు. ఇంతియ గాక పెద్దనయే యట్లు వ్రాయదొరకొన్న నెట్టిదానినైనను వ్రాయసమర్థుండగుటకు సందేహంబులేదు. కఠిన మాయె నని యెంచిన దాని విసర్జించుఁగాక చించుఁగాక రాజుపే రం దుంచుటకు యత్నించునా. మనుచరిత్రంబు ముం దిడుకొని వ్రాసి రామభూషణుఁడు వసుచరిత్రమును రస సమంవితముగఁ జేయ వసుచరిత్రంబు ముం దిడుకొని భూషణుని కెక్కుడగు పెద్దన యాముక్తమాల్యద వ్రాయ నుద్యోగించిన దాని నెట్టి రసవంతముగఁ జేయవలయు ? అట్లుగాక కఠినమాయెనని యెంచియు రసపుష్టింగూర్చి తలంచియు దాని పండితులకుం జూపుటెట్లు గలుగు దీనిం బరస్పర భేదంబు లుండుటచేత నీయాముక్తమాల్యద పెద్దన కృతం బనుట సరి కా దని తోఁచెడిని.

2. గ్రంథంబున వ్రాసియుండు సంగతులంగూర్చి కొంతయోచించి యావలఁ దొంటి యభిప్రాయంబు స్థిరపఱుతము. "అని యిష్టదేవతా ప్రార్థనంబు సేసి మున్నే కళింగదేశ విజిగీషామనీషన్ దండెత్తిపోయి విజయవాటిం [1] గొన్నిదినంబు లుండి శ్రీకాకుళనికేతనుం డగు నాంధ్ర మథుమథను సేవింపంబోయి హరివానరోపవాసం బచ్చటఁగావింప నప్పుణ్యరాత్రచతుర్థయామంబున నాయీశ్వరుండు స్వప్నంబున సాక్షాత్కరించి యి ట్లనియె:-

  1. దీని నిపుడు బెజవాడ యందురు.