పుట:Kavijeevithamulu.pdf/564

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
558
కవి జీవితములు.

లును సాహితీపటిమయు నీతనిచే రచియింపంబడిన యాముక్తమాల్యదం జూచిన గోచరంబవు. ఈతండు తత్పూర్వము రసమంజరీ ప్రముఖ సంస్కృత గ్రంథంబు లనేకంబులు రచియించె. ఈతఁడు గతించిన పిమ్మటఁ గొంద ఱాముక్తమాల్యదకుఁ గవి యీతండు కాఁ డనిరి. దానికివారి వలనఁ గొన్ని కారణంబులు చెప్పఁబడినవి. వానిని సంగ్రహంబుగ నిట వివరింతము.

పెద్దన ముందు మనుచరిత్రంబు వ్రాసె ననియు దానిం జూచి రామభూషణుఁడు వసుచరిత్రము నంతకు నెక్కుడు రససమంచితముగ నొనర్చెననియు దానికిఁ గనలి పెద్దన యాముక్తమాల్యదను వ్రాసెననియు, నది కఠినం బవుటచేఁ దానిఁ దనపేరిటఁ బ్రకటింపక కృష్ణరాయల పే రందుఁ గీల్కొల్పె ననియు దీనికి దృష్టాంతంబుగఁ బెద్దన మనుచరిత్రంబులోఁ జెప్పినపద్యంబులే కొన్ని యం దున్నవనియుఁ నట్టివచోధోరణి పెద్దనకుం దక్క నన్యులకు నలవడ దనియుఁ బల్కుదురు. ఇపుడిపుడు కొంద ఱాధునికులు రెండు గ్రంథంబులు సావథానంబుగఁ జూచి మనుచరిత్రములోనిజాడ లాముక్తమాల్యదలోఁ గానరాకుండుటం జేసియు గొన్ని ఛందోభేదంబులును వ్యాకరణభంగంబులు నిం దుండుటంజేసియు నిది పెద్దనకృతంబు గా దనియు మఱియొకండు కల్పనాంశంబునఁ బెద్దన యంత వాఁ డైనను శాస్త్రంబున నాతనిం బోలె విశేష పరిశ్రమంబు లేనివాఁడు రచించి నట్లున్నదనియు నిర్ణయించిరి. గ్రంథంబున నున్నస్ఖాలిత్యంబులం గూర్చి తర్వాత విచారింతము. అది పెద్దన కవనంబు స్పష్టంబుగఁ గా దనుటకు నిప్పటివారిచే మఱికొన్ని హేతువు లూహింపఁ బడుచున్నవి. అందుల నిజం బాలోచింపక తెలియరాదు.

1. వసుచరిత్రముం జూచి పెద్దన యీర్ష్యచే నాముక్తమాల్యద రచించె నని యుండెనుగదా దానికిఁ గారణం బూహింప వలయు. పెద్దన ప్రబంధమునకు వలయువర్ణనలును దానికిఁ దగు రచనావిశేషం