పుట:Kavijeevithamulu.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

557

చేయించి రెండవగదిలోఁ బండియున్న రాయల కవ్వార్తఁ దెలిపి తోడి తెచ్చి యావధూవరులఁ గలిపి యొకరియెడ నొకరికి గల్మషం బుండకుండఁ బ్రమాణంబులు సేయించి వారల దీవించి తనయింటికిఁ జనియె. అతని యాశీర్వచనబలంబుచే నాదంపతులు విశేష మైత్త్రి గల్గి చిరకాలంబు సకలభోగభాగ్యంబు లనుభవించి సంతసమున నుండిరి. ఆచిన్నదాని పేరు తిరుమలదేవి. మొదటి భార్యకుఁ జిన్నాదేవి యను నామాంతరము గలదు.

కృష్ణరాయని సంతానము.

కృష్ణరాయనికిఁ బురుషసంతానము లే దని యిదివఱకే చెప్పి యున్నారము. అతనికి స్త్రీసంతాన మున్నట్లుగ దృష్టాంతము లున్నవి. ఆ గ్రంథములలో నొకటి రామాభ్యుదయము. అందు అళియరామరాజుం గూర్చి వర్ణించుచు.

"ఆపటుకీర్తి రామవసుధాధిపచంద్రుఁడు కృష్ణరాయధా
 త్రీపతిసార్వభౌమదుహితృప్రియుఁడై."

అని చెప్పంబడియున్నది. ఇఁక రెండవగ్రంథము హైద్రాబాదాతురుష్కప్రభువుల వ్యవహారచరిత్రము. అందులోఁ బాదుషా కొండబీరుకోట పట్టుకొనినప్పుడు కృష్ణదేవరాయలు తనయల్లుం డగు "శివరాజు లేక బసవరాజును" నతని లక్షసైన్యములతోఁ బంపినట్లుగా వివరించఁబడి యున్నది. ఈ బసవరాజు బెజవాడలో నధికారము చేయుచుండిన పూసపాటి వంశములోనివాఁడు. ఇతని నాఁ డుదయగిరి దుర్గము మొదలు రాయవేలూరువఱకునుండుదేశము పూసపాటివారి స్వాధీనములో నుండె నని చెప్పియుంటిమి. పై యిర్వురు రాజులయొక్క భార్యలు కృష్ణరాయనికూఁతులుగాఁ గాన్పించుచున్నారు. ఇంక నెవరైనఁ గలరేమొ తెలియదు.

కృష్ణదేవరాయల సాహిత్యవిషయము.

ఈ కృష్ణరాయండు నొక గొప్పకవి. ఈతని ప్రజ్ఞావిశేషంబు