పుట:Kavijeevithamulu.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

556

కవి జీవితములు.

బునకుఁ బంపందలంచిరి. అపుడు తిమ్మరుసు కృష్ణరాయలకడ కరుగుదెంచి. యాతనికి రహస్యంబున నావృత్తాంత మంతయుం దెల్పె. దాని కాతండెంతయుఁ జింతించి యిదియుఁ దొంటిచందం బే యయ్యెనా యని యోచించుతఱిఁ దిమ్మరు సాతనికిట్లనియె. స్వామీ నీవు చింతింపవలదు. నీకు బ్రాణభయం బేమియు లేదు. నేనొక యుపాయంబు వన్ని యున్న వాఁడ .దానిచే నాయింతిమనంబు నుపథంబునకు వచ్చు నని తలంచెద. ఈ దినం బేలిక యేవారికిఁ గాన్పింపకుండ నొకరహస్యస్థలంబునం బడియుండుఁడు. అనితెల్పి యాతనిం బనిచి తిమ్మరుసాపునస్సంధాన భవనంబున కుం జనియందుఁ గృష్ణరాయనికి మాఱుగ నొక విగ్రహంబు సిద్ధంబు సేసి దానిలోఁ దేనే బోయించి హంసతూలికాతల్పంబున దాని నుంచి పైనుత్తరీయంబు గప్పి రాయండు బడలి యున్నాఁడు గావున నాతనిఁ గొంత వఱకు లేపవల దని యచ్చటిస్త్రీజనంబులకుం దెల్పె. వారును జరగనున్న వృత్తాంతంబు దెలిసియున్న వారలే కావున సంతసమేమియులేక వల్లె యని పెళ్ళికూఁతు నచ్చో దిగ విడిచి తలుపుమూసి తమత్రోవం జనిరి. అంతకుమున్నే తిమ్మరుసు నలుదిక్కులు బరికించి యేరికిఁ గానరాకుండఁ గృష్ణరాయల మంచముక్రింద నొదిగియుండె. చెలులందఱుఁ జనినతోడనే యా రాజకన్యక తాను దాఁచి తెచ్చినబాకుం దీసి యారాజు నొక పోటు పొడిచె. తోడనే యందున్న మధు ద్రవంబు పైకిఁ జింది యా యింతిముఖంబుపయిని నోటంబడియెను. దానిరుచి వెంటనే చూచి యాహా? యీరాజురక్తం బింతరుచియై యున్నది. రా జెట్టివాఁడో గదా ! మన కనుభవించుపంతు లేదయ్యె ననుడుఁ దిమ్మరుసు మెల్లన వెలికివచ్చి తల్లీ యారాజు వలయునేని నీ కాతనిం దెచ్చి యొప్పింతు. నీతొంటిబుద్ధి మానునట్లు వరమిమ్ము. అనుడు నాయింతి నిశ్చేష్టితయై కొంత తడ వుండి యాతండు తిమ్మరుసుగ నెఱింగి తాఁ జేసినద్రోహంబునకు క్షమియించి రక్షింప రాజునకుం దెల్పి యాతనిం దోడితె మ్మని ప్రార్థించె. అపుడు తిమ్మరుసు పెండ్లికూఁతుచే బాస లనేకంబులు