పుట:Kavijeevithamulu.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

553

గి నిర్భయంబుగఁ జని వీరంబు సారించి యాజల దేవతను జయించుభంగిఁ జేతులెత్తుకొని భగవన్నామంబు దలంచుచుఁ జెరియొకకనమం బ్రవేశించిరి. అపు డా చెఱువుఁ ద్రవ్వు పనివాండ్రు వారిపైఁ గొన్ని తట్టల మన్నును ద్రిమ్మరించిరి. తోడనే యాకనమలు మరలఁ దెగక యప్పటియట్ల నుండెనఁట. అనంతరము వరదరాజమ్మ తనవాక్యాను సారంబుగ నాయిర్వురపేరిట రెండుగ్రామంబులు గట్టించె. వారిలో నన్న పేరు పెదకంబఁడు. తమ్మునిపేరు చినకంబఁడు. కావున నాగ్రామంబులకుఁ బెదకంబము చినకంబము నని నామంబు లుంచె. ఇపు డీ రెంటినిం గల్పి కంబమని యొకగ్రామంబుగ వ్యవహరింతురు. కృష్ణరాయపత్నికి ననఁగా నీ వరదరాజమ్మకు తుక్కాజీ యను నామాంతర మున్నట్లును, ఆమె కొన్నిశ్లోకములు కృష్ణరాయనికి దయగల్గునట్లు రచియించె ననియును ప్రతీతి గలదు. ఆశ్లోకము లీక్రింద వివరించెదము.

తుక్కాపంచరత్నములు.

'తుక్కానామ గజపతిపుత్త్రీ కృష్ణదేవరాయ పత్నీ' అని యున్నది.

శ్లోకములు.

1. చర న్వనాంతే నవమంజరీషు న షట్పదో గంధఫలీ మజిఘ్రత్,
   సా కిం నర మ్యా స చ కిం న రంతా బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా.

2. మా కింశుక ప్రకట యాత్మనిమేషమాత్రం మన్మస్తకే విహరతీతి మధువ్రతో౽యమ్,
    కిం మాలతీ విరహ వేదనయా త్వదీయం దృష్ట్వా ప్రసూన మచిరా దనలభ్రమేణ.

3. భ్రమర భ్రమతా దిగ న్తరాళే క్వచి దాస్వాదిత మీక్షితం శ్రుతంవా,
    వద సత్య మపాస్య పక్షపాతం యది జాతీకుసుమానుకారి పుష్పమ్.

4. కుసుమాని లిఖస్తు నామ చిత్రే కతిచి త్కారువిశేషరూఢశిక్షాః,
    సురభిత్వ మమూని కిం లభంతే కిము చైతేషు రసం పిబ న్తి భృఙ్గౌ:.

5. కిం మాలతీం మ్లాయసి మాం విహాయ చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః,
   లోకే చతుర్భి శ్చరణైః పశు స్స్యా త్స షడ్భి రత్యర్థ పశు ర్న కిం ప్యాత్.

అనునీశ్లోకములు వరదరాజమ్మచేఁ గృష్ణరాయనికిఁ దనయెడఁ దిరుగ ననుగ్రహము గలుగుటకునై రచియింపఁ బడెననియును, అట్టి శ్లోకంబులఁ గృష్ణరాయనిహృదయము కరఁగెనని తెలియును.