పుట:Kavijeevithamulu.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

552

కవి జీవితములు.

మ్మ వృత్తాంతం బంతయుఁ దెల్పి యుపాయం బేమియుం కానరాకుండుటంజేసి యిట్లు వగచుచుంటి నని చెప్పె. అపు డాపలుకులు విని యా వృద్ధాంగన యిట్లనియె. అమ్మా దానికి కారణంబు నాకుఁ దెల్లం బయ్యె. ఆచెఱువు నరబలిం గోరుచున్న యది. ఆకనమల నొక్కొక మనుజుని బలి యిచ్చినఁ గట్ట లెప్పటియట్టుల నుండు. ఈపని యెట్లు సిద్ధించు నని విచారింపవలదు. నే దానికిఁ దగునుపాయం బరసితి. నా కిర్వురుసుతులు గలరు. వారినిర్దఱ నాపని నెఱవేఱుప బనిచెద. నీకు సంశయింపం బనిలేదు. వారిని వానియం దుంచి యీసారి కనమలఁ బూడ్పింపుము. కార్యంబు గట్టెక్కు అను నా గొల్లదానిపల్కుల కులికి వరదరాజమ్మ భయకంపిత స్వాంతయై అయ్యయ్యో? యిట్లు పల్కు వెఱ్ఱులు గలరె? సుతుల బలికై యిచ్చెద మని సతు లనవచ్చునే నాచెరువు కనమలు పూడకున్నను మేలాయె నీకొడుకులఁ జంపఁ దలంపకుము. అని బుద్ధులు సెప్ప నట్టిపల్కు లాలింపక గొల్లది యేయుపాయంబుననైనం బురుషులలోఁ బ్రసిద్ధిని జెందినవానిజన్మం బే సఫలంబు. వగవకుము. పోయివచ్చెద నని యింటికిం జని తనపుత్త్రులం గని వారల కవ్వార్తఁ దెలిపి మీనామంబు లీభువి నాచంద్రార్కంబు లై యుండు సుకాలంబు సంప్రాప్తంబయ్యె, సముత్సాహు లై చనుండని తెల్పె. వారును మాతృ వాక్యపరిపాలనదక్షు లై పెండ్లికిం బోవునట్లుగ సంతసంబుతోఁ జనుదెంచి వరదరాజమ్మకుఁ గాన్పించి తల్లీ సుతులనామంబులు జగద్విదితంబు లగున ట్లొనరింపం గరుణింపవే యని పలికిరి. వారిసాహసంబునకు మెచ్చి మీకుఁ బ్రత్యుపకృతిఁ జేయ నే నెంతదాన, అయినఁ గొంతధనం బిచ్చెదఁ గైకొని ధర్మంబు సేసికొం డనుడు వార లిట్లనిరి. తల్లీ మాకు ధనం బేల మాయెడ నీకు దయ గలదేని మా నాంబు లీజగంబున శాశ్వతంబు లై యుండునట్లుగ మా పేరిట రెండూళ్లఁ గట్టింపుఁ డని తెల్పిరి. దానికి వరదరాజమ్మ సంతసించి వాగ్దానంబు చేసెను. అనంతర మా యిర్వురు సోదరులు పొలికలనుకుం జను మహాశూరులభం