పుట:Kavijeevithamulu.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

551

చుకొని యామీఁద పో నని పరిచారకులకుం దెల్పె. అప్పు డందులోని కొందఱుపరిచారకు లవ్వార్త రాజునకుఁ దెల్పిన నాతండు తిమ్మరుసుతో నాలోచన సేసి యామెయెడ సదయుం డై యచటనే యుండుటకు నాజ్ఞ యొసంగి యా పెకు వలయునపుడు కోరినధనం బి మ్మని యాతని కాజ్ఞ యొసంగె. ఇంతియకాక యాపె కచ్చోటనుండ నొక భవనంబు గట్టించి తగుసామగ్రిని దాసీదాసాదులను నియమించె. ఆచిన్నది యచ్చోట ననేక ధర్మకార్యంబులఁ జేయుచు మునివృత్తితోఁ బరంబు జింతింపుచుఁ గాలంబు గడపసాగెను.

ఈమెనామంబు వరదరాజమ్మ యందురు. ఈమెవాసముచేసినవనంబు కడప జిల్లాలోనిది. అచ్చోట దూరదూరంబున నుండునాలుగుపర్వతంబులలోనికి కట్టలు గట్టించి దాని నొక చెఱుపుగ నేర్పఱిచె. తత్సమీపంబున నున్నకొన్ని శిలాశాసనంబులలో వరదరాజమ్మ రూపు చెక్కఁబడియున్న దని వాడుక గలదు. ఈతటాకంబు మిగుల విశాలమై నదియు రమణీయ మైనదియు నెటు జూచిన నాఱుక్రోశంబులు (12 మైళ్లు) కట్టలు కలదియునై యున్నది. ఇం దనేకములైన లంకలు వ్యవసాయపుభూములు చిన్న పల్లెలుంగూడఁ గల వని వినంబడు. ఈచెఱువు సంపూర్ణ మగుచో జరిగె నని చెప్పంబడు నొకకథ కలదు. అది మిగుల నద్భుతంబుగఁ గాన్పించు. ఏదియేని విశేషకార్యంబు నెఱవేర్చు తఱి నిట్టిపనులు జరుగక తప్ప దని యిప్పటికిని కొందఱుహిందువుల యభిప్రాయంబు ఆకథ నీక్రింద వివరింతము.

ఈచెఱువు సిద్ధమగుతఱి రెండుకనములు విశేషవిస్తీర్ణంబుగలవి కట్టలలో నేర్పడెనఁట. దానిం గప్పింప నాయిల్లాలు విశేషంబుగ సొమ్ము వమ్ముచేసిన నది కార్యకారి కాదయ్యె. దానికి వరదరాజమ్మ చింతాకులమానస యై యేమిగతి స్వామీ యని యోచించుచుండె. ఇట్లుండు తఱి వీరియింటి కనుదినంబును మజ్జిగ నిచ్చునొక ముసలిగొల్లది వచ్చి యాపె చింతించుటకుఁ గారణ బడిగె. దాని విని వరదరాజ