పుట:Kavijeevithamulu.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

548

కవి జీవితములు.

డ్కొనిచనియె. అతండు తాంబూలంబు దెచ్చువానిఁ దనతో రమ్మనియె. లోనికిఁ జని తిమ్మరుసు గజపతిం జూచి మాతల్లి యగుభవిష్యత్పట్ట మహిషిని దర్శించు వేడుక గలదు. అనుడు వల్లెయని యారాజు తన యంతిపురి కవ్వా ర్తం బనిచి యాపెకు సన్నాహంబున నుండ నాజ్ఞ యొసంగి యాతనిం దోడ్కొని చనియె. అచ్చో నాచిన్నది సర్వాభరణ భూషితయై మేఘంబుచాటు నుండి బయలువెడలు మెఱపుచందంబున తెర దాఁటి వచ్చి యెదుట నిలచి తిమ్మరుసు నాతనితో నున్న పరిచారకుం జూచె. పరిచారకు నెగదిగంజూచుచో నాపెకు నాతని పా దంబున నున్న పచ్చలమట్టియ గాన్పించె దానిచే నాతండే కృష్ణరాయం డగు నని గ్రహించి గిఱ్ఱున వెనుకకు. దిరిగి లోనికిం జని ఆపరిచారకుండే కృష్ణరాయం డని తమవారికిం దెలి పె. అపు డాయాఁడువారలందఱు నాతనిం దమ కోటలోపలనే మృతినొందింపఁదలంచి యేమియుపాయం బని కల వెలంబడసాగిరి, దీనంతయుం దిమ్మరుసు నిమిషమాత్రంబున గ్రహించి కృతకభృత్యుదిక్కు మొగంబై కనుగీటి యౌరా తమలంబున సున్నం బింతగ వేసితివేలరా యని యుగ్రుండై లేచి తఱిమికొనుచు గృహాంగణంబు లన్నియుం దాఁటి సింహద్వారంబునుండి నిర్గమించె. రాజభార్యలు లోనుండి దేవిడీ బంధింపు మని వర్తమానంబు పంచిరి.అంతకుమున్ను వీరలిరువురును గోట వెలుపట వచ్చి నిల్చిరి. వర్తమానంబు రా వేగమే ద్వార పాలకులు తలుపులు బిగించి మార్గావరోధంబు గల్గించిరి. అంతట దిమ్మరుసు పఱచిన వార్త రాజభార్యలు విని యాతనిఁ బట్టి తెం డని కొందఱిని దుమికించిరి. వారికిని ద్వారావరోధం బే గలుగుటం జేసి మరలివచ్చి యవ్వార్త నగరునకుఁ బంచిరి. ఇటఁ గృష్ణరాయండును తిమ్మరుసుప్రజ్ఞావిశేషంబున నిశ్చింతతో శిబిరంబు లోనికిం జేరె.

గజపతి తనకోటలోని వృత్తాంతమంతయు నరసి తనవారిని వారించి లగ్ననిశ్చయంబు సేయుం డని తిమ్మరుసునకుఁ జెప్పిపంచె. అపుడు