పుట:Kavijeevithamulu.pdf/553

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

547

నందముతోఁ జనుదెంచి కృష్ణరాయని కాశుభవార్తం దెలిపె. అపుడు కృష్ణరాయం డావనిత సత్కులసంజాత యవుటకు సంతసించెఁగాని దాని రూపలావణ్యంబు లెట్టివో చూడవలె నని తెల్పె. దానికి తిమ్మరుసు మీ కాచిన్నది యక్షిగోచరం బగు టెట్లు గల్గు ననినఁ గృష్ణరాయం డేదియేని యుపాయంబుచే నావనితం జూచి గాని పరిణయంబు గా నని తెల్పె. అట్టిపల్కులు విని తిమ్మరుసు కొంచెము చింతించి మంచిది బయలువెడలుద మని తనపల్లకీలో రాజుంగూడఁ గూర్చుండఁబెట్టికొని రాణువ తోడ నడువఁ గదిలి పెనుగొండ చేరి లగ్న నిశ్చయంబునకుఁ బ్రధానంబునకు వచ్చు చున్నా మని గజపతికి వర్తమానంబుఁ బంచె. ఇట నాగజపతి తిమ్మరుసును బంచి నిజాంతఃపురంబునకుం జని తన బంధుల కవ్వార్తః దెలిపిన వారందఱుఁ గృష్ణరాయని నెంతయు నిందించి నీకూఁతుం గులము తక్కువవాని కిచ్చుట యనుచితం బని కోపించి పల్కఁ దొడంగిరి.

గజపతి అట్టిపలుకులు విని యేమియుఁ బల్క నోరాడక తిమ్మరుసున కేను మాట నిచ్చియుంటిని, నాపలుకు ననుసరించి కార్యంబు నడపెద. ఎవరియదృష్టం బెట్లున్న నట్లగు. పొ మ్మని యాతండుమాత్రము దానికి సమ్మతించె. బందువులందఱును స్త్రీజనంబును దాని కిష్టపడరైరి. అట్లగుటచే వారందఱుం గలిసి కృష్ణరాయని సంహరించియైనఁ దమనింద వాపికొనఁ దలంచిరి.

గజపతి తిమ్మరసుకోర్కె ననుసరించి ప్రధానతాంబూలంబు గొనుటకు నాతని రమ్మని వర్తమానంబు బనిచె. అప్పుడు తిమ్మరుసుం దగుపరివారజనంబులం గొని కృష్ణరాయనికి తాంబూల మందిచ్చువాని వేషం బమర్చి తనకంచుకంబుసంచిలో నాకుల నునిచికొని రాజుచుట్టిన యాకులన్నియుఁ బదిమందియుఁ జూచునట్లుగ నందికొని మఱియొకసంచి నుంచి మొదటిసంచిలోని మడుపులు నములుచు గజపతికోటలో నికిం జనుదెంచె. ఆరాజు నెదురుగ వచ్చి తిమ్మరసును లోనికిం దో