పుట:Kavijeevithamulu.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

546

కవి జీవితములు.

ల్లిలో నున్న నాయికీవారు ఫాదుషా తమవైపు వచ్చునని మిక్కిలి భయపడి, కొండపల్లికోట తాళము లిచ్చి వేసెదమని, అదివఱకు తాము చేసిన పనులను క్షమించు మని వేడి షాజెడాతో సంధి జేసుకొనిరి. అందుపైని షాజెడా వారిని చూచి క్షమించి వారి అప్పటిహక్కులలో నుంచుటకు ఫాదుషాతో సిఫార్సు చేసెను. ఫాదుషా అందుకు సమ్మతించి, వారిని కాన్పురకోటకుఁ బొ మ్మని కొండపల్లికోటను విడిచిపెట్టు మని యాజ్ఞాపించెను. కొండపల్లికోట తుదకు షాజెడా కిచ్చివేయఁ బడెను. ఫాదుషా వలన చేయఁబడిన టెలింగనా యుద్ధముల వృత్తాంతమిది. ఇటనుండి వినికి మీఁద నేను పూర్వము వ్రాసినకథలు వ్రాసెదను.

కృష్ణరాయని ప్రథమవివాహచారిత్రము.

కృష్ణరాయనికి దాసీపుత్రుం డని ప్రసిద్ధి గల్గి యుండుటం జేసి సత్కులీను లగురాజు లేరును గన్నియ నీయ సంశయింపఁ దొడఁగిరఁట. దానికిఁ గృష్ణరాయండును మిగులం జింతించుచుఁ దిమ్మరుసునకుఁ దెల్పిన నాతండు సంశయింపకుము సత్కుల ప్రసూతన యగునొకప్రనవ కోమలిం దెచ్చి వివాహంబు సేసెద నని తెల్పి అప్పుడే బయలువెడలి సేనాపరివృతుండై వినుకొండకుం జనుదెంచి యచ్చో దమకుఁ గప్పము గట్టుగజపతికిఁ దనరాక యెఱిగించి పుచ్చె. సర్వాధికారంబు సేయు కృష్ణరాయనిముఖ్యమంత్రి వచ్చియున్నాఁ డని విని యారాజు నెదురుగ వచ్చి యాతనిం దోడ్కోని గృహంబునకుం జని సగౌరవంబుగ నాతని సత్కరించి మీరాకకుఁ గతం బేమి, దేవరయాజ్ఞ శిరసావహించెదము, సెలవిండనుడుఁ దిమ్మరుసు నవ్వుచు మీరు సత్యవాక్య ప్రామాణికులరు. నాయాజ్ఞ నడిపెద మని తెల్పితిరిగానఁ జెప్పెద వినుండు. మీకూఁతును మారాజశిఖామణి కిచ్చి పరిణయంబు సేయుఁడు. ఇదియ నాయభిమతంబు, అనుడు నారా జేమియు ననలేక వెలంవెలంబా~ఇ కొంతతడవు చింతించి మీయిష్టానుసారంబుగాఁ గార్యంబు నడిపెద నని తాంబూలం బిచ్చి యాతని సాగఁబనిచె. తిమ్మరుసును మిక్కిలి యా