పుట:Kavijeevithamulu.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

545

టనిచ్చివేయుచున్నాముగావున తనప్రాణములు రక్షింపుఁ డని ఫాదుషాను వేడుకొనిరి. ఫాదుషా అందుల కొప్పుకొని కోటలో నున్నధనముతోఁగూడ రాజు నాక్రమించి, రాజుయొక్క సైన్యములను వారిదేశమునకుఁ బోనిచ్చెను.

కృష్ణరాజు తనయల్లునిఁ బంపుట.

ఫాదుషా కొండ బీరుకోటను తీసుకొనె ననుభయంకర మైనవార్త వినఁగానే, కృష్ణరాజు తనయల్లుఁ డైనబసవరాజువురపు శివరాజును లక్షకాల్బలముతోను, ఇరువదివేల గుఱ్ఱపుదళముతోను, ఫాదుషానుండి కోటను తిరిగి తీసుకొమ్మని పంపెను. బీజనగరపు సైన్యము వచ్చుచున్నదని ఫాదుషా విని అప్పుడు తన అమీరులను సలహా అడిగెను. అందుకు, వారు, కొండపల్లినుండి కొండబీరునకు కొద్దిరోజులలో రావచ్చును. గనుక కొండబీరుకోట విడిచి కొండపల్లికి పొ మ్మని సలహా యిచ్చిరి. అతఁడు ఆప్రకారముగాఁ జేసెను. రాజుసేనలు ఫాదుషా కొండబీరుకోట విడిచిపెట్టి కొండపల్లి వైపునకుఁ బోయె నని విని, కొండబీరుకోట నాక్రమించి, వారి బరు వైనసామానులు కోటలో నుంచి ఫాదుషా పైకి వెడలెను. ఫాదుషా కొండబీరు పైఁ దిరిగెను. అక్కడ జరిగిన యుద్ధములో, రాజుసేనలు రెండుజాములు పోట్లాడి, ఓడిపోయి కొండబీరుకోటలో దాఁగుండిరి. ఫాదుషా కొండబీరుకోటను ముట్టడించెను. అప్పుడు కృష్ణరాజుసేనలు, ప్రతిసంవత్సరము ఫాదుషా బొక్కసమునకు మూఁడులక్షల పెగోడాలు చెల్లించెద మనిన్ని, ఆస్థలమందే అప్పుడు రెండులక్షలు చెల్లించి, తక్కిన లక్ష చెల్లించువఱకు తమరాజ కుమారులలోఁ గొంతమందిని పూచీదార్లుగా నుంచెద మని చెప్పి ఫాదుషాతో సంధిజేసికొనిరి. ఫాదుషా అందుకు నొప్పుకొని, కొండబీరు తనరాష్ట్రములోఁ జేర్చుకొని వారిని విడిచిపెట్టెను.

కొండపల్లివద్ద అల్లరు లణఁచి వేయుట.

ఫాదుషా కొండబీరుకోట నాక్రమించె నని వినఁగానే కొండప