పుట:Kavijeevithamulu.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

544

కవి జీవితములు.

యిచ్చిరి. అతఁడు అప్పుడు కొండబీర్ నకు వెళ్లి ఆకోటపై నెదిరించెను. అంతట రాజు సైన్యమును విల్లంకొండ, పెనుగొండవద్దనుండి, రాత్రులు ఫాదుషా సైన్యముల నెదిరించి, సొమ్ము దోఁచుకొనుచుండెను. పిమ్మట ఫాదుషా వారి రెండుకోటలు ముందుగాఁ దీసుకొని, కొండబీర్ కోటను దీసుకొనుటకు నిశ్చయించెను. తరువాత విల్లంకొండ కోటపైకిఁబోయి, దాని నాక్రమించి, సోవాయిల్ ఖాన్ అనువానిని కోటకాపుగా నుంచెను. షాజాదా కొండపల్లిని జయించిన పిమ్మట ఫాదుషా కొండపల్లిని షాజాదా స్వాధీనములో నుంచి కొండపల్లిచుట్టు నున్నరాజుల వలన అల్లరులు జరుగుచుండె నని విని, యాయల్లరు లణఁచి వేయుటకు కొండపల్లికి బయలుదేఱెను.

కృష్ణరాజు ఫాదుషా కొండబీర్‌కోట నెదిరించుట విని, కొండబీరును గాపాడుటకుఁగానే బదివేల కాల్బలము, ఐదువేల గుఱ్ఱపుదళము గలసైన్యము, తనయొక్క చెల్లెలికుమారుని యధికారము క్రింద నుంచి, పంపెను. ఈసైన్యము కొండబీర్ చేరఁగా ఫాదుషా విల్లంకొండ కోట నెదిరించుటయు కొండపల్లి వైపు వెళ్లుటయు వారికిఁ దెలియజేయఁబడెను. వారు విల్లంకొండవద్ద ఫాదుషా లేకపోవుట చూచుకొని విల్లంకొండపైకి బయలుదేఱిరి. అక్కడ సోహియల్ ఖాను, ఎదిరించుకుండ కోట నిచ్చివేయుట కొప్పుకొని మూఁడురోజులు తనకు వాయిదా యిమ్మని కోరెను. తత్క్షణమే అతఁడు బీజనగరము సైన్యములు విల్లంకొండకు వచ్చి కోట నెదిరించినవార్త ఫాదుషాకు పంపించెను. ఫాదుషా విల్లంకొండకు తిరిగివచ్చి బీజనగరపుసైన్యము నోడించఁగాఁ, వారు తమ సొమ్ము విడిచి పెట్టి యుద్ధభూమినుండి పాఱిపోయిరి. ఫాదుషా ఆయాస్తిని తీసుకొనెను. ద్రవ్యమునుమాత్రమే అఱువదియేనుఁగుల పై వేసి తనబొక్కసమునకుఁ బంపించెను.

కొండబీరు తీసుకొనఁబడుట.

ఫాదుషా పిమ్మట కొండబీరుపైకి వెళ్లి కోట నెదిరించెను. ఫాదుషాతో నెదిరించలే మని రాజుసైన్యములు తెలుసుకొని, తాము కో