పుట:Kavijeevithamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

43

44. షట్సప్తతిపద్మనాయకగోత్రవందనీయుఁడు. ఇది మొదట ప్రతాపరుద్రునిచే వెలమలకు గౌరవము కల్గించుటచేత నతనికిని అనంతర మట్టియౌదార్యమునఁ గులమువారిని సంరక్షించుటచేత నతనివంశజులకునుగూడఁ జెల్లుచుండును.

45. కోటగిరివజ్రాయుధనాగార్జునపురకోటసాధక. మాహురీపురక్షేత్రశత్రునివారణ, వేములకొండస్థలవైరిరాజజీమూతపవన, ఏకశిలానగరసమీప శాత్రవరాజ్యగహనదహన, చెతంపూఁడిమనవిభాళ, హొన్నెగట్టు, కుదిరిగట్టు, మండలీకరగండ - అనుబిరుదులు పైస్థలములలో నపుడపుడు పౌరుషములఁ జూపుటచేతఁ జెవ్విరెడ్డివంశస్థులవలన సంపాదింపఁబడినవి.


46. పాండ్యగజకేసరి 1. వీరపాండ్య. 2. విక్రమపాండ్య
47. పంచపాండ్యదళవిభాళ 3. పరాక్రమపాండ్య. 4. సుందరపాండ్య. 5. కులశేఖరపాండ్య అను పాండ్యపంచకమును జయించుటచేఁ గల్గెను.

48. హరిత్తోరణబిరుదము. మట్లూదియిమ్మడనురాజుం బరిమార్చి వానికి బిరుదముగా నున్న పచ్చతోరణముఁ గైకొనుటచేఁ గల్గెను.

49. తిరుకాలరాయరాజ్యస్థాపనాచార్య - తిరు కాలరాజునకు మరల రాజ్య మిప్పించుటచేఁ గల్గెను.

50. మత్స్యనాయకగండ - ఇది మాడుగులు ప్రభుని జయించుటచేఁ గల్గెను.

51. కొదమనాయకతలగుండుగండ - కొదమనాయకుని సంహరించుటచేఁ గల్గెను.

52. ధరణీవరాహలాంఛనుఁడు - ఈబిరుదు చాళుక్యులను జయించినపుడు కల్గి యుండ నోవును. చాళుక్యులకు ధరణీవరాహలాంఛనబిరుదు చెల్లుచుండెను. సోమకులపరశురాముఁ డనునది చాళుక్యులను జయించుటచేతనే చెల్లెను. పైదాని నీబిరుదు స్థిరపఱుచుచున్నది.