పుట:Kavijeevithamulu.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

540

కవి జీవితములు.

5. దండయాత్రను వర్ణించిన కవులు, 1. మాదయగారి మల్లన్న, 2. అల్లసాని పెద్దన్న, 3. ముక్కు తిమ్మన్న మొదలగువారు.

3. గజపతిరాజునకు సహాయులై వచ్చిన పాత్రసామంతులు 16.

1. బలభద్రపాత్రుఁడు 2. దుర్గాపాత్రుఁడు 3. భీమాపాత్రుఁడు 4 ముకుందపాత్రుఁడు 5. భీకరపాత్రుఁడు 6. బేరుపాత్రుఁడు 7. రణరంగపాత్రుఁడు 8. ఖడ్గాపాత్రుఁడు 9. అఖండలపాత్రుఁడు 10. మురారిపాత్రుఁడు 11. వజ్రముష్టిపాత్రుఁడు 12. తురగరేవంతపాత్రుఁడు 13. గజాంకుశపాత్రుఁడు 14. అసహాయపాత్రుఁడు 15. మృగేంద్రపాత్రుఁడు 16. పేరు తెలియలేదు.

4 గజపతికూఁతు పేరు తుఖ్కాజీ అంబ.

గజపతికూఁతురు కృష్ణరాయని వెంబడించక మార్గములో నిల్చిపోవుట.

దీనింగూర్చి దేశములో నున్న కథలు మెకంజీదొర రికార్డులంబట్టి టెయిలరు దొర వ్రాసియున్న సంగ్రహమును మఱియొకచో వక్కాణించెదను.

కృష్ణరాయల కాలములోఁ దురుష్కుల యధికార ప్రాబల్యతవారితోఁ గృష్ణరాయలు పోరుట. (కుటుబ్‌షాహి తవారిక్ చరిత్రలో) నుద్తాఖాన్‌కూలీ కుట్బుషా హీజీరా. 918.

పై నుదహరించిన పుస్తకము ప్రస్తుతమం దనఁగా 1893 సం. మందు సజీవు లై యున్న వాలాజావంశస్థుఁ డైన హసనల్లిఖాన్ నవాబుగారియొక్క చెన్నపురి పుస్తక సముదాయములోనిది. (Library)

క్షత్త్రియుల విషయము.

కల్‌కుట్బుషా గోలుకొండ పట్టణమును కట్టించెను. గోలుకొండ రాజ్యాధిపత్యము ఆయన పుచ్చుకొనినపిమ్మట మొదటి యుద్ధము రాజు కొండవద్ద జరిగినది. ఆస్థలము పరిపాలించువాఁడు వేంకటనాయకనాముఁడు. దీనిపిమ్మట దేవరకొండకోట తీసుకొనఁబడెను. పైఁజెప్పిన యుద్ధమైనపిమ్మట పాంకల్, ఖాన్పుర యనుకోటలు తీసుకొనఁబడెను. ఖాన్పురకోట పాంకల్‌కును, కోయిల్ కొండకును మధ్య నున్నది. ఈరెండును బీజనగరు రాజ్యమునకుఁ జెందియున్నవి. కోయిల్ కొండయు పిమ్మట ఆక్రమింపఁబడెను. పిమ్మట చక్రవర్తిషితాబ్‌ఖాన్ అను రాజునకు చెందియున్న కంబముమెట్టు, ఓరంగల్ వేలం