పుట:Kavijeevithamulu.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

539

రాయని మంత్రి యగునప్పాజీయొక్క బుద్ధిచమత్కారములు దెల్పుకథ లనేకములు దేశములో వ్యాప్తమై యున్నవి. అని టైలరు అను చరిత్రకారుఁడు వ్రాయుచున్నాఁడు.

కృష్ణరాయవిజయములోని కొన్ని యంశములు.

పై నుదాహరించిన కృష్ణరాయవిజయములోని కొన్ని యంశములు మాత్రము సంగ్రహించఁబడినవి. వాటిని గొంచెము విస్పష్ట పఱుపవలయును గావున నీక్రింద వివరించెదను.

1. కృష్ణరాయనికి సహాయులుగా నుండు నితర రాజులు.

1. ఆర్వీటివారు 2. నౌకువారు 3. నంద్యాలవారు 4. వెల్గోటివారు (వెలమలు). 5. పెమ్మసానివారు 6. బూడహరివారు 7. తొరగంటివారు 8. తుళువదొరలు 9. రావెలవారు.

2. కృష్ణరాయని రాజ్యకోశాదుల వివరము.

a. విజయనగరపట్టణమును గట్టించునపుడు విద్యారణ్యస్వాములవారు చేర్చినరూకలు తొంబదియాఱుకోట్లు భూషణములు నాలుగుకోట్లు. అవిగాక విద్యారణ్యులవారి యనంతర రాజులు కృష్ణదేవరాయలనాఁటికిఁ జేర్చినధనము తొమ్మిదికోట్లు.

b. కన్నడరాజ్యమంతయు నెనుబదినాల్గు 84 లక్షలు చెల్లుచుండెను.

c. వేయి జిరాగురాలకు లక్షవంతున నిరువదినాల్గువేల జిరాగురాలు నిరువది నాల్గులక్షలు కాల్బలము.

d. కరికి వేయిచొప్పున నూఱుకరిఘటలకు పండ్రెండులక్షలవరాలు.

e. వేయిమంది భటులకు నిరువదినాల్గువేలచొప్పున లక్షయఱువదివేలప్రజలకు నలుబదిలక్షలు జీతములు. ఈప్రకారముగానే తన్నాశ్రయించియుండు దొరలకు ముజరా యిచ్చుచుండెను.

f. కృష్ణదేవరాయ లధికారమునకు వచ్చునాఁటికి కృష్ణాకావేరి మధ్యదేశ మతనియధికారముక్రింద నుండెను.

కృష్ణరాయలు తురుష్కులపైఁ బోవునపు డున్న సేనల వివరము.

1. భటులు ఆఱులక్షలు 6,00,000

2. గుఱ్ఱములు అఱువదాఱువేలు 66,000.

3. ఏన్గులు రెండు వేలు 2,000.

4. సామంతు లగురాజులు, వెలమలు, కమ్మవారు తోడ నుండిరి.