పుట:Kavijeevithamulu.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

534

కవి జీవితములు.

చూచి అతఁడు రాజుగా గ్రహించి అచటి బ్రాహ్మణులు కలిసి అతఁ డట్లు వచ్చుటకుఁ గారణ మే మని అతనినే (రాయలను) సంప్రశ్నించిరి. దానికి రాయలు సమాధానముగా నది దుష్టశిచణార్థము శిష్ట రక్షణార్థముగా నని వివరించెను.

సాళువ తిమ్మన్న యనుమంత్రి కృష్ణరాయనికి విశేషధన నిక్షేపములఁ జూపెను. అట్టి సమయములోఁ జారులుగా నుండుహరకారలు విజయపురము ప్రభునియొక్కయు (Bejapoore) నైజాముయొక్కము వ్యవహారములు కొన్నిటిం గృష్ణరాయనికిం దెల్పిరి. నరసింహరాయని సింహాసనమునకుఁ గృష్ణరాయలు వచ్చెననుమాట పై సంస్థానముల ప్రభువులు విని భయాక్రాంతులగుటంజేసియో లేక సహింపఁజాలకనో గాని నైజామును గజపతిరాజును విజయపురపు ప్రభుఁడును తమలోఁ దమ రొకసంధిఁ గావించుకొనిరి. వారిలో గజపతిరాజు జగన్నాథస్వామికి భక్తుఁ డవుటం జేసియు, బ్రాహ్మణపోషకుం డవుటంజేసియు నతఁడు క్షమియింపఁదగినవాఁ డని కృష్ణరాయని ముఖ్య మంత్రి కృష్ణరాయనితోఁ జెప్పెను. అటుపైఁ గృష్ణరాయలు డిల్లీపైకి (అనగాఁ దురుష్కులపైకి) దండెత్తుటకు నిశ్చయించెను. అట్టికార్యము నిర్వహించుటకుఁ దగిన సన్నాహములు ముందుగాఁ జేయంబడెను. పిమ్మటఁ గృష్ణరాయలు తనరాణువం దీసుకొని తరలెను. అట్టిసమయములో ననేకములగుశుభశకునములు గాన్పించెను.

ఇట్లుగా బయలువెడలి కృష్ణరాయలుపైరాజుల దేశములలో నుండెడు సామంతరాజులం జయించి వారిదేశములను స్వాధీనముచేసికొనియెను. ఎదిఱింపకనే లొంగినవారినందఱిని సంరక్షించెను. ఇట్టి యుద్ధములు పెక్కు లైనపిమ్మటఁ గృష్ణరాయలు గోలకొండపై దండయాత్ర నడిపెను. అపుడు లక్షగుఱ్ఱపుదళము గల తురుష్కసేన కృష్ణానదియొక్క అవతలదరిని వచ్చి నిలిచెను. అంతఁ గృష్ణరాయని సేనానులలో నొకఁడు తాను పోయి పైతురుష్కసేనలం జయించెద నని