పుట:Kavijeevithamulu.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

529

Mr, Taylor's Catalogue Raisonnee Vol III.

page 55.

పైగ్రంథకర్త తాను చేసిన (Analysis) అనుగ్రంథములోఁ గృష్ణరాయని గుఱించి కొంత వివరించితి నని చెప్పెను.

page 1gi

నెం. 656 లో గృష్ణరాయ అగ్రహారముయొక్క చెర్వువిషయము చెప్పంబడినది. ఈగ్రామములో నుండెడు చెరువులు మూఁడును తెగిపోవుటచేత నచ్చో నుండెడు బ్రాహ్మణ కరణములు కృష్ణరాయని సహాయార్థమై వేడుకొనిరి. కృష్ణరాయలు మిక్కిలి యౌదార్యముతో వారు గోరిన సహాయముం జేసెను.

page 400. (Catalogue Again)

కూరంబరు లనుపేరుగల యొక యారణ్యక శాఖామనుజుల వృత్తాంతమును దెల్పెడు నొకపుస్తకము సన్యాసికృత మైనది కలదు. దానిలో నీప్రజలయధికారము ఆ దొండెచక్రవర్తి అధికారము దనుకను జైనమతము ప్రబలువఱకు నున్నట్లు చెప్పంబడును. ఇంతియకాక యీ ప్రజలయధికారము కృష్ణరాయల అధికారమువఱకును బ్రబలముగా నున్నందులకు దృష్టాంతములు గలవు. వీరు గర్విష్ఠు లై యుండుటంబట్టి వేళ్లాలరు లనుజాతిప్రజలు కూరంబరుల సంహరించుటకుఁ గాను ముందర నారణ్యకులం బంపిరి. కృష్ణరాయల సేనలును, వియ్యాలవా రను పాలగాండ్ర సేనలును గూడి కూరంసర జాతివారిని మూలముట్టుగ సంహరించిరి.

page 430.

Cullattur (కల్లత్తూరు) అను గ్రామములోని ప్రాచీనములైన బంగారు పంట విషయము చెప్పుచు నీగ్రామము కూరంబరులయొక్క రెండవకోట గలదని చెప్పును. ఆదొండచక్రవర్తి వారిని జయించినపిమ్మట ఆకోటను పదిమంది స్వాధీనములో నుంచెను, వారిలో కొండయికట్టవేల్లాలరు నుండెను. వీఱందఱారాజునకుఁగ్రిందివారుగానుండి దేశమును