పుట:Kavijeevithamulu.pdf/527

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

521

తిప్పలూరు గ్రామమునకుఁ దూర్పుచొప్పవామిలో నున్నశాసనము :-

శాలివాహన శకవర్షములు 1450 అగునేఁటి సర్వజిత్తు సం. శ్రావణ బ.30 సోమవారము శ్రీకృష్ణదేవరాయ మహారాయలవారు అష్టదిగ్గజకవీశ్వరులకు ధారవోసి యిచ్చిన తిప్పలూరు అగ్రహారమందు దొమ్మర్లు ఇచ్చు పన్ను ఈగ్రామమున నున్న శివ, విష్ణువుల దేవాలయముల యొక్క ఆరగింపులకు సమర్పించిరి.

కామలాపురమునకు రెండుపరుగుల దూరమున నాగ్నేయమున కొప్పులూ రనుగ్రామము కృష్ణరాయలతో చదరంగమాడి గెలుచుకొనిన తిమ్మన్న యనునాంధ్రకవీశ్వరునకు బ్రాహ్మణునకు సర్వమాన్యాగ్రహారముగా నిచ్చెను. ఇందులకు దాఖలా యీకవీశ్వరునిచేతఁ జెప్పంబడినపద్యములో నున్నది.[1] అది యెట్లనఁగా :-

సీ. కౌశికగోత్రవిఖ్యాతుఁ డాపస్తంబ, సూత్రుఁ డార్వేలపవిత్రకులుఁడు
    నందిసింగామాత్యునకును దిమ్మాంబకుఁ, దనయుండు సకలవిద్యావివేక
    చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే, నల్లుండు కృష్ణరాయక్షితీశ
    కరుణాసమాలబ్ధఘనచతురంతయా, న మహాగ్రహారసన్మానయుతుఁడు

తే. తిమ్మయార్యుండు శివపరాధీనమతి య, ఘోరశివగురుశిష్యుండు పారిజాత
    హరణ మనుకావ్య మొనరించె నాంధ్రభాష, నాదివాకరతారసుధాకరముగ.

శా. స. 1485

వేలూరులో నొక గొప్పకోట కలదు. ఒకదేవళమును గలదు. ఈ గుడి కట్టించినవా రనేకవిధములుగా ననేకులుగాః జెప్పంబడుదురు. కృష్ణదేవరాయలు నందులోని వారిలో నొకఁడు. ఇతఁడు (A. D. 1586-77=1509 శా. శ.) సంవత్సరములో దీనిం గట్టించిన ట్లున్నది. (ఈ కాలమునకు 25 సంవత్సరములక్రిందటనే కృష్ణరాయనిర్యాణ మగుటంజేసి పై సంవత్సరము తప్పు) కృష్ణదేవరాయలకుఁ బూ

  1. ఇది పొరపాటు. ఈపద్యమున నాసంగతియే లేదు. రాయలతోఁ జదరంగ మాడి మెప్పువడసినది మఱియొక తిమ్మన.