పుట:Kavijeevithamulu.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

520

కవి జీవితములు.

ఇందుకు దిగువనుండేది. శ్రీమన్మహాదేవుని నగరు కోకటం స్థళ కరణం కట్టము మండ్రాజు తిప్పనకొడుకు ముమ్మండ్రాజు కోకటం సకలేశ్వరుని నగరు ఈ బహుధాన్య సంవత్సరమునకు పునఃప్రతిష్ఠ శ్రీకారం మూలానను చేయించెను. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాన్వితః, నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః.

ఇదిగాక యీశాసనమువద్దనే యుండు రెండవశాసనము, ఈ శకసంవత్సరములో నీ కవీశ్వరునినాఁడే కార్తీక బ. 12 లు కోకటము చెన్న కేశవపెరుమాళ్లకు అల్లసాని చొక్కయ్యంగారి పుత్త్రుండు పెద్దయ్యంగారు యిచ్చిన భూదాన ధర్మశాసనము క్రమ మెట్లన్నను :- కృష్ణదేవరాయలు ఘండికోట సీమలోను, మాకు వుంబళిగా నీయ నవధరించిన కోకటానను దేవుని నై వేద్యమునకును, దీపారాధనకును, మేము ఉత్థానద్వాదశి పుణ్యకాలమందు సమర్పించినచో చర్మంచేను ఖ 4. అని వ్రాసియున్నది.

శా. స. 1450 (A. D.) 1528.

కొండపల్లి మాలకాపురములమధ్య నొకఱాతిపలకయున్నది. అందుపైని శా. స. 1450 గల యొక శాసనమున్నది. అది యొక తురుష్కునివలనఁ గొండపల్లికోటను పట్టుకున్నందున నతిని సంతోషమును సూచించుటకుగా నొక సత్త్రము కట్టిననాఁటిదిగా నున్నది. ఈశాసనము దానికిగా నీయంబడిన భూదాన ధర్మశాసనమై యున్నది. రెండవ శాసనములోఁ గృష్ణరాయ నిర్యాణము శా. స. 1452 (A. D. 1530) అయినట్లు కానుపించును.

అదవాని సమీపి గ్రామవృత్తాంతములో శా. స. 1450 లోని కృష్ణరాయని వ్యవహార విశేషములం జెప్పుచు నాగ్రామము నింకను అభివృద్ధి నందించె నని చెప్పెను.

పైని వ్రాసిన తిప్పలూరు గ్రామము అష్టదిగ్గజ కవీశ్వరులకు సర్వాగ్రహారముగా నిచ్చి నందులకు రెండుదాఖలా లున్నవి. వానిలో