పుట:Kavijeevithamulu.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

518

కవి జీవితములు.

డలి జమ్మెలోయ మార్గముగాఁ బోయి వడ్డాది మాడుగులు మొద లగు సంస్థానములం జయించి కటకముంగూడ స్వాధీనము చేసుకొని కటకేశుఁ డగుప్రతాపరుద్ర గజపతికూఁతుం బరిణయం బై తిరిగీ తనదేశమునకు నీశాసనకాల మగు 1441 సంవత్సరమునాఁటికి సింహాచలము వచ్చి యుండును. ఈసంవత్సరము చేసినశాసనములోఁ గొన్నిగ్రామములు సింహాచలస్వామి కిచ్చి యుండుటచేతను, వెనుకటి శాసనకాలము నాఁటికి భూదానము చేయలేక కేవలము ధనమునే సింహాచలేశ్వరునికి సమర్పించి యుండుటచేతను, కటకదేశజయము తొల్లిటి శాసనమునాఁటికి కాలేదనియు 1441 సంవత్సరముననే అయినదనియును నిశ్చయించవలసియున్నది. ఇందులోఁ బ్రతాపరుద్ర గజపతివలనఁ బుచ్చుకున్న గ్రామములు కళింగదండపాటలోనివి, అని చెప్పుట చేతఁ గృష్ణరాయలు ప్రతాపరుద్ర గజపతిని జయించినను, అతనిరాజ్య మతనికి తిరిగి యిచ్చి వేసియుండె ననియును, తనయొక్క విజయముం జూపుటకుఁగా నాప్రతాపరుద్ర గజపతి దేశములోని కొన్ని గ్రామములు తన స్వాధీనములో నుంచుకొని వానిని సింహాచలేశ్వరునకు సమర్పించె ననియు నూహింప వలయును. పై శాసనములు నాలిగింటిచేతను కృష్ణదేవరాయలు తూర్పు దేశమును జయించుటకై శా. స. 1437 లో బయలుదేఱి కొంతదేశమును స్వాధీనము చేసుకొని విజయనగరమునకుం బోయి తిరుగ 1438 సంవత్సరాంతమున వచ్చి 1441 సంవత్సరము సగమగు వఱకు నుండెననియు నిదియైనపిమ్మటఁ గృష్ణా చెంగల్పట్టు జిల్లాలలోని కార్యములు జరుపుచు 1442 సంవత్సరమంతయు నుండి 1443 సంవత్సరములోఁ దిరుగ దేశములోఁ బ్రవేశించియుండు ననియు నూహింప నై యున్నది.

పైనుదాహరించిన శాసనములన్నియు (Col. Mackenzie Collections) లోనివై గవర్నమెంటువారి ఓరియంటల్ మ్యానస్క్రిప్టులైబ్రరీలోఁ జేరినవై యుండుటచేత నమ్మఁదగిన వనియును, వానివలన మనము పైని నిర్ధారణ చేసిన కథయంతయు విశేషదోషయుక్తమై యుం