పుట:Kavijeevithamulu.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

517

వారాన శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర మూరురాయరగండ అరిరాయవిభాడ, భాషగిత ప్పువరాయరగండ, యవన రాజ్యాస్థాపనాచార్య, శ్రీవీరప్రతాప కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనారూఢుఁడై సింహాద్రినాథునికి తమపేరిట భోగము నడిచేటందుకు ప్రతాపరుద్ర గజపతి మహారాయలచేతను పుచ్చుకున్నగ్రామాలు, కళింగ దండపాటలోనిగ్రామాలు, పెదగానిగ్రామం, 1. అగనంపూడిగ్రామం, 1. అమ్మ చెల్లెపల్లెలు, 1. గంగవరంపల్లె, 1. పిన్న అగనంపూడి పల్లె, ఉభయగ్రామాలు, 2 కి సింహగిరి అప్పనికి నడిచే భోగబలిహరణం కట్టడి దినం 1కి శ్రీఅంగరంగ భోగానకు గంధం, 1. పలం. అగరు, 2. వ, కర్పూరం, 1 చిన్నము. కస్తూరి 2 చిన్నాలు. పన్నీరు 4 చిన్నాలు. కుంకుమపువ్వు, 1 చిన్నం. పువులదండలు 4. మాలెలు. 4. నై వేద్యానకు బియ్యం పుట్టి, 1. పకాళం తు 2. పాయసం తూనికె, 6. డోరలు. 4. ఫేడాలు సోడీలు, 8. సారనత్తులు, 8. అరిశెలు, 8. సాదుమనోహరాలుః 8. చిన్న మనోహరాలు, 4. నందిమెడ్డినం, 8. అప్పాలు, 8. హనకేళీలు, 8. కర్పూరకాలత్తులు బడాలు, 8. కక్కరాలు (చక్కిలాలు,) 4. వెరసి 80 పానకాలు 2. గట్టిగా కులచం, 1. నై వేద్యానకున్ను పేరాలమున్ను కూడా నైనవి యేడు తూములు, వడ్లు ఏఁదుమున్ను కుంచెఁడుపళ్లు, పోఁకలు, 50. తమలపాకులు, 100 మిర్యాల సంబారాలు 27. డబ్బులయెత్తు జాజికాయలు. 10. ఇందుకు వైనము సత్త్రం 30 కి బ్రాహ్మణభోజనం యీ ధర్మానకు యెవరు తప్పితే వారు గంగలో గోహత్యఁ బ్రహ్మహత్య మాతృ పితృహత్య చేసినపాపాన పోతారు.

శ్లో. స్వదత్తాం పరదత్తాం వా యో హరేత వసుంధరామ్,
    షష్టి ర్విర్షసహప్రాణి విష్ఠాయాం జాయతే క్రిమిః.

అని యున్నపైశాసనమును బట్టి యీక్రిందిచారిత్ర మూహింపవలసియున్నది. ఎట్లన్నను. వెనుకటి శాశనమును బట్టి శా. స. 1438 వ సంవత్సరములోఁ గృష్ణరాయలు కటకపుదండయాత్రకై, బయలువె