పుట:Kavijeevithamulu.pdf/517

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
511
శ్రీ కృష్ణదేవరాయలు.

హాదేవుని తులాపురుష మహాదానమున్ను చేయ నవధరించి, తిరిగి విజయనగరానకు విచ్చేసి, రత్నసింహాసనస్థుఁడై సామ్రాజ్యము చేయుచున్ను మఱి కళింగదేశదిగ్విజయార్థ మై విచ్చేయుచు అహోబలానకు వేం,చేసి దేవుని దర్శించి, శ్రీవిజయాభ్యుదయ శా. స. 1438 అగునేఁటియువసం. పుష్య శు. 15 శుక్రవారమందు శ్రీ అహోబలదేవునికి కంఠమాల 1, పచ్చలు చెక్కినవజ్రాల మాణిక్యాలపతకము 1, మాణిక్యాల కడియాల జోడు 1, పైడిపళ్లెము 1, కాక 1000 వరహాలున్ను తమ దేవులు సమర్పించిన పతకము 101 తాకట్టున్ను సమర్పించి దేవర అమృతపడి నై వేద్యము అంతరంగ వైభవాల కున్ను, చాగలమఱ్ఱి సీమలోని మద్దూరు అనే గ్రామమున్ను సమర్పించిరి. ఈసేవ ఆచంద్రార్కస్థాయి అయి నడవవలె నని యిచ్చినధర్మ శాసనం.

ఈ శాసనములోని సంగతులు ముఖ్యముగా విచారించవలసినవి. ఇందులో వివరింపఁబడిన శాలివాహన శకముతో సరియైన ప్రభవాది సంవత్సరము వ్రాయంబడ లేదు. ఇది పొరపాటు కావచ్చును. మొదటి శాసనకాలము మొదలు రెండవశాసనసమయమువఱకు నడుమనుండిన తొమ్మిదిమాసములలోఁ గృష్ణరాయఁడు తూర్పుదేశపు దండయాత్ర చేయుచున్నట్లు స్పష్టమే. ఇపు డీశాసనములోఁ గృష్ణదేవరాయలు తిరుగ తనరాజధాని యగువిజయనగరమునకుం బోవుసమయములోఁ జేసియున్న విశేషముల వక్కాణించెను. శా. స. 1438 సంవత్సరము చైత్రమాసము మొదలు పుష్యమాసమువఱకుఁ దొమ్మిది మాసములు పట్టియుండును. కాఁబట్టి యీకాలము గల ప్రభవాది సంవత్సరము ధాత సంవత్సరముగాఁ జెప్పుటయే యుక్తియుక్తముగా నుండును. అయితే కృష్ణదేవరాయలు గతసంవత్సర దండయాత్రలో సింహాచలమునకుఁ దూర్పుననున్న దేశముల స్వాధీనపఱుచుకొనియుండలేదు గనుక నక్కడ నుండి తిరిగి స్వదేశమునకుం బోయి సేనలను ధనముం గూర్చుకొని తూర్పు దండయాత్రకు బయలువెడలిన సమయ