పుట:Kavijeevithamulu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

510

కవి జీవితములు.

నవి లేవు. 1437 సంవత్సరములోని ఆషాఢమాసము మొదలు 1438 సంవత్సరము చైత్రమాసమునాఁటికి ననగాఁ దొమ్మిదిమాసములలో గృష్ణరాయలు కొండవీటి దుర్గము, కొండపల్లిదుర్గము, రాజమహేంద్రవరదుర్గము జయించినాఁ డనియును, అట నుండి కళింగదేశముం జయించుటకుఁగాను సింహాచల క్షేత్రమునకు వచ్చి విజయార్థ మై సింహాచలేశుని సేవించి అచ్చోఁ దాన ధర్మముల నడిపెననియుం దేలును.

నెం. 3 రు శా. స. 1438. ధాతసం. అహోబలశాసనం, లోకల్‌రికార్డులు, 10 సంపుటము, 555 పుటలో నహోబలగ్రామము, కైఫీయతు వ్రాయుచు నీపై నుదాహరించిన శాసనము నమరించెను. అది ఎట్లన్నను :-

"స్వస్తి శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరు రాయరగండ, అరిరాయవిభాడ, అష్టదిక్కురాయ మనోభయంకర, పూర్వ, పశ్చిమ, దక్షిణ, సముద్రాధీశ్వర, యవన రాజ్యస్థాపనాచార్య, గజపతి దళవిభాడ, శ్రీవీరప్రతాప శ్రీవీర కృష్ణదేవ మహారాయలు పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి ఉదయగిరి దుర్గమును సాధించి తిరుమల ప్రేతరాయ మహాపాత్రుని పట్టుకొని వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మనబ్రోలు, తంగేడు, కేతవరము మొదలయిన గిరిదుర్గాలు ఏకధాటిని గై కొని కొండవీటికి విచ్చేసి దుర్గంచుట్టు వాఱుకుని నడచప్పరాలు పెట్టి, కోట పడదోయించి నాల్గుదిక్కులాను లగ్గలు విడిపించి దుర్గం తీసుకుని దుర్గంమీఁద నున్న ప్రతాపరుద్ర గజపతి మహారాజుల కొమారుఁడు వీరభద్రరాయఁడు, కుమార హంవీరపాత్ముని కొడుకు న్నరహరిదేవు శ్రీనాథరాజు, రామరాజు కొడుకు లక్ష్మీపతిరాజు రాచూరి యలువఖానుఁడు, ఉద్దండఖానుఁడి జన్యామల కసవాపాత్రుఁడు, తుమ్మపాలచంద్రమహాపాత్రుఁడు వీరు మొదలైన పాత్రసామంతులనున్ను, మన్నెవారిని జీవగ్రహముగా పట్టుకొని వారికి అభయదానమున్ను యిచ్చి, ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మ