పుట:Kavijeevithamulu.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

506

కవి జీవితములు.

డను. అందుల తారీఖులు వివరింపఁబడియే యుండెంగావున నాజిల్లా అంతయు నందులో నప్పటికాలములో జేరిన కటకపురాజ్యముం గలిసి యున్నవి. ఇదియంతయు న్యూయల్ దొర పుస్తకమునుబట్టి వ్రాయఁ1

కృష్ణరాయల శాసన వివరము.

బడినది. కృష్ణరాయల పూర్వ దిగ్వజయ యాత్రావిశేషములు దెల్పు కొన్ని శాసనములు మనకు లభ్యములైనవి. కృష్ణరాయచారిత్ర విశేషములం దెల్పుట కవి ముఖ్యములుకావున వానిలో ముఖ్యము లగువానిని శకవర్షముల రీతి నమర్చి యీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

శా. స. ప్రభవాది సం.రము గ్రామము విశేషములు.
I. 1437 = యువ. ధరణికోట. ఉదయగిరి, కొండవీడులజయించిన కథ.
II. 1438 = ధాత సింహాచలము. రాజమహేంద్రవరము మొదలు సాధించుట.
III. 1438 = ధాత. అహోబలము. మన్నె వారిని పట్టుకొనుట.
IV. 1441 = ప్రమాది. సింహాచలము. ప్రతాపరుద్రునికడ గైకొనినగ్రామములలోఁ గొన్ని స్వామి కిచ్చుట.

NO. 1ః శాసనము. శా. స. 1437 యువ సం. ధరణికోట:-

స్వస్తి శ్రీమన్మహారాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరురాయరగండ, అరిరాయవిభాడ, భాషిగె తప్పువరాయరగండ, అష్టదిక్కురాయ మనోభయంకర, పూర్వ దక్షిణ పశ్చిమసముద్రాధీశ్వర, యవన రాజ్యస్థాపనాచార్య, గజపతివిభాడ, శ్రీవీరప్రతాప, శ్రీకృష్ణదేవ మహారాయలు విజయనగరానుండి పూర్వదిగ్విజయయాత్రకు వేంచేసి, ఉదయగిరి దుర్గము సాధించి తిరుమల ప్రేయతరాయ మహాపాత్రుని పట్టుకొని, అద్దంకి, వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, తంగేడు కేతవరము మొదలైన గిరిదుర్గ స్థలదుర్గాలు అన్ని ఏకధాటిం గైకొని కొండవీటిదుర్గము లగ్గలు పుచ్చుకొని, ప్రతాపరుద్ర గజపతికొమారుఁడు వీరభద్రరాయనిన్ని, కుమారహం వీరమహాపాత్రునికొడుకు వీరమహాపాత్రుఁడు, రాచూరి మల్లఖానుఁడు, ఉద్దండఖానుఁడు, పూసపాటి రాచి