పుట:Kavijeevithamulu.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

504

కవి జీవితములు.

ఇట్లు (Antiquities) అనుగ్రంథములో నుదాహరింపఁబడిన శాసనములలో 1 బళ్లారిజిల్లాకు 12 శాసనము లున్నవి. వానికాలముయొక్క వివరము

శా. స. ఇట్లు పండ్రెండు శాసనములు కాన్పించెడిని. ఇందులో నైదుశాసనములు ప్రత్యేకము కృష్ణరాయని ప్రధాన పట్టణ మగువిజయనగరములో నీయంబడినశాసనములై యున్నవి. పైశాసన కాలములలో 1436 మొదలు 1439 వఱకు మూఁసంవత్సరములును, అది మొదలు 1434 వఱకు నాల్గుసంవత్సరములును 1444 మొదలు 1450 వఱ కాఱుసంవత్సరములకాలమును వ్యవధి యున్నది. ఆవ్యవధికాలములే కృష్ణరాయఁడు విస్తార శ్రమసాధ్యము లగుదేశములపై దండయాత్రలు చేయుచు నన్యదేశములలో నున్నట్లు భావించుటకు దగియుండును.
1 - 1432
2- 1434
1434
1- 1435
2- 1436
1436
1 - 1439
1- 1443
1- 1444
1- 1450
1- 1452
1 తేదిలేనిది.
మొత్తము 12

కృష్ణాజిల్లా శాసనములు.

2. ఇందలిశాసనగ్రామములు పూర్వము కృష్ణాజిల్లా నామముతో నొప్పుదేశములోనివి కావు. అవి కృష్ణరాయలకాలము నాఁటికి సీమ లనునామముతో నుండెను. మఱికొంతకాలమున కవి తురుష్కుల యధికారములో కొండవీడు, కొండపల్లి, ఏలూరునిజాంపట్నం సర్కార్లుగా నుండెను. పిమ్మట ఇంగ్లీషువారికాలములోఁ గొన్నాళ్లు గుంటూరుజిల్లా, బందరుజిల్లాలుగా నుండి ప్రస్తుతములో నవి యన్నియు కృష్ణా గోదావరీజిల్లాలోని వైనవి. ఇట్టి చిక్కులలో నుండుటచేత పైగ్రామములు కృష్ణరాయలకాలములో నేసీమలోనివో వివరించలేను.

శా. స. 1432, 1438, 1439, 1439 1441 లోనివి 9. 1443, 1448, 1 తారీఖులేనిది. మెట్టున 17 శాసనములు. ఈసంవత్సరములలోఁ గృష్ణరాయలు ప్రస్తుతపు కృష్ణాజిల్లాలోఁ జేరిన సీమలను జయించె నని చెప్పవలసియున్నది