పుట:Kavijeevithamulu.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

501

"మ. అలుకన్ఘోటకధట్టికాఖురపుటీహల్యం గురాసానిపు
       చ్చలవోదున్ని చలచ్చమూగజమదాసారప్లుతిం గీర్తిపు
       ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ దృష్టి కే
       దులఖానోగ్రకపాలమర్ధపహరిద్భూజాంగలశ్రేణికిన్.

గౌడదేశమును జయించుట.

కృష్ణరాయఁడు గౌడదేశముం జయించినట్లు మనుచరిత్రలోఁ గలదు. మఱియొక చాటు ధారయుఁ గలదు. రెండవది అతని ఆస్థానకవులలో నొక్కరు చెప్పినట్లుగా నున్నది. పెద్దన్న మొదలగువారు చెప్పిన మఱికొన్ని పద్యములవలన నీ రాయలు లుత్తరహిందూదేశముపై దండెత్తినట్లు తెలియుంగావున గౌడదేశముం గూర్చి చెప్పిన చాటుధార కేవలము కల్పితము కా దని తలఁచవలసియున్నది. ఆచాటువును, పెద్దనచెప్పిన పద్యముల నీ క్రింద వివరించెదను. ఎట్లన :-

"ఉ. గౌళపతీ యనేవు చిలుకా యిటు పల్కుట నీకు న్యాయమా
      మూలల నున్న వారి నిటు ముంగిట. బెట్టెడువారు నుందురే."

      పెద్దన్న చాటుధార :-

"మ. గవను ల్బల్లిదమయ్యె డిల్లి కిల మక్కాకోట మే టయ్యె నీ
       భువనంబెల్ల నదల్చిపుచ్చె ననఁగాఁ బోలేరు సందేరులన్
       దవసంబెక్కె బెడందకోట పురకాం తాగర్భనిర్భేదన
       శ్రవణం బయ్యె భవత్ప్రతాపజయవార్తల్ కృష్ణరాయాధిపా."

       మను చరిత్రములో

"ఆపంచగౌడ ధాత్రీతలం బెవ్వాని, కసివారుగా నేఁగునట్టిబయలు"

కృష్ణరాయ శాసన వివరము కాలనిర్ణయము.

ఆంధ్రులలోనే కాక హిందూప్రభువులు పెక్కండ్రు తమ రేదైన విశేషకార్యములం జేయునపుడు దేవబ్రాహ్మణులకు దానషర్మములు విశేషించి చేయుటయును, వానిని స్థిరీకరించుటకు శాసనములం జెక్కించుటయును గలదు. ఈకృష్ణరాయలు గూడ నట్లే యొనరించె నని అతనిచే నీయంబడిన కొన్ని శాసనములవలనం గాన్పించును. ఇట్టి కృష్ణ