పుట:Kavijeevithamulu.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

500

కవి జీవితములు.

8. పొట్నూరు :- ఇది విశాఖపట్టణము జిల్లా లోనిది. బాహుబలేంద్రుని వంశస్థులకు కొంతకాలము ముఖ్యపట్టణ మై యుండెను.

9. మాడెములు :- మన్యసంస్థానము లనియును, మాడుగులు సంస్థానమనియు నగును.

10. వడ్డాది : ఇది మత్స్యవంశస్థు లని చెప్పంబడు నొక సంస్థానమువారి ముఖ్యపట్టణము.

11. కటకపురి :- ఇది యుత్కళదేశ మనబరఁగు నోఢ్రదేశమునకు ముఖ్యపట్టణము. గజపతిప్రభువులలో ముఖ్యుఁ డగు ప్రతాపరుద్రగజపతి యిక్కడ నుండు సింహాసనముపై నెక్కెను.

కొండవీడువఱకు నుత్కళరాజు లగుగజపతుల ప్రభుత్వము క్రింద నుండినట్లుగాఁ గానుపించును. కాఁబట్టి పైపద్యమువలన గజపతుల సర్వరాజ్యము కృష్ణరాయలు జయించె నని చెప్పనొప్పు.

కలుబరిగిం జయించుట

ఈవఱకు నుడివిన దంతయుఁ గృష్ణరాయని రాజ్యము తూర్పు బెజవాడ మొద లుత్తరము కటకపురివఱకును వ్యాప్తమై యుండె నని తెల్పుటకై యున్నది. ఆ ముక్తమాల్యదలోవలనే వివరింపఁ బడిన మఱి కొన్నిపద్యములవలన నది పశ్చిమోత్తరములయం దెంతవఱకు వ్యాపించియుండెనో అది సూచింపఁబడియె. అది యెట్లన్నను :-

"తే. తిరుగు హరిపురి సురతరు సురల మరిగి, బహుళహళహళ భరితకల్బరిగనగర
      సగరపురవరపరిబృఢ జవనయవన, పృతన భవదసి ననిఁ దెగి కృష్ణరాయ."

దీనింబట్టి కృష్ణరాయఁడు కలుబరిగె (ప్రస్తుతములో కుల్బర్గ) అను స్థలములోపలను, సగరపురి (సాగర్) అను పట్టణమున నుండు తురుష్కులం జయించె నని యున్నది.

ఖురాసాన్ దేశముం జయించుట.

పై ఆముక్తమాల్యదలోనే కృష్ణరాయలు ఖురాసాన్ దేశము పై దండెత్తిపోయి తద్దేశ ప్రభుం డగుయేదుల్ ఖాన్ అను తురుష్కుం జయించిన ట్లున్నది. ఎట్లన్నను:-