పుట:Kavijeevithamulu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

499

మెట్టును జయించె. ఆనాఁటికి కటకము పై దండెత్తి వెళ్లవలె నని కృష్ణరాయల కభిప్రాయ మున్నట్లును, తనదేశముపైకి వచ్చునేమో నని ఆకటకాధివుం డగునుత్కలరాజు జడియుచున్నట్లును పైపద్యములోని యెత్తుగీతలవలనఁ గాన్పించును. ఎట్లన్నను :-

"గీ. బలనికాయంబు కాలుమట్టుల నడంచు, కటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
     డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు, రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుఁడు.

దీని యనంతర కాలమున రచియింపఁబడిన యాముక్తమాల్యదలో కృష్ణరాయ లుత్కలదేశముం జయించుటకుఁ బోవుచో మార్గమున జయించిన మఱికొన్ని రాజ్యములపేళ్లు చెప్పెను. దానివలన బెజవాడ మొదలు కటకమువఱ కున్న దేశములు కృష్ణరాయల స్వాధీన మైనట్లు కాన్పించు. ఆ పద్య మెద్దియన :-

"సీ. తొలుదొల్త నుదయాద్రిశిలఁ దాఁకి తీండ్రించె, నసిలోహమునవెచ్చనై జనించె
      మఱి కొండవీ డెక్కి మార్కొని నలి యైన, యలక సవాపాత్రు నంటిరాఁజె
      నట సాగి జమ్మెలోయఁ బడి వేఁగి దహించి, కోన బిట్టేర్చి గొట్టానఁ దగిలెఁ
      గనకగిరిస్ఫూర్తి గఱచె గౌతమిఁ గ్రాఁచె, నవుల నాపొట్నూరు రవులుకొలిపె

తే. మాడెములు వేల్చె నొడ్డాది మసియొనర్చె, కటకపురిఁ గాల్చె గజరాజుకలఁగిపఱవ
    తోఁకచుజ్జన నౌర నీ దురవగాహ, ఖేలదుగ్రప్రతాపాగ్ని కృష్ణరాయ.
                                                                            ఆముక్తమాల్యద.

పైపద్యములో నుదాహరింపఁబడినవి :-

1. ఉదయాద్రి.
2. కొండవీడు.
3. వేఁగిదేశము, జమ్మెలోయ.
4. కోనసీమ.
5. కొఠాన (కొట్టాముతాలూకా.)

6. కనకగిరి రాజమహేంద్రవరము దగ్గఱ, హేమగిరి యని యొకగ్రామము దుర్గము నుగలవు. పైపేరు దానిపర్యాయ మై యుండ నోపు. నెల్లూరిజిల్లాలోని కనిగిరి దీని పర్యాయనామ మని కొందఱందురు.

7. గౌతమిఁ గ్రాఁచె ననుటచేత గౌతమీనదికి రాజమహేంద్రవరమునకు నుత్తరముగ నుండు రహితాపురము మొదలగు మన్యపు సంస్థానముల స్వాధీనపఱచుకొనె నని భావము