పుట:Kavijeevithamulu.pdf/503

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

497

ప్రతిష్ఠచేసి, పాలెగాండ్రందఱిని యాదేవాలయమునకు రావించి అచ్చట కృతిమోపాయముచేత వారిని హతజీవితులనుగాఁ జేసెను. పిదప కృష్ణదేవరాయలు అత్యానందభరితుఁడై నిజబలసమేతంబుగాఁ గొండవీటి సీమ కేతెంచి, కొండవీడు, బెల్లముకొండ నాగార్జునకొండ, వినుగొండ దుర్గముల నాక్రమించుకొనెను. ఈయనగారు ఖిల్లాలో నుండుట కిష్టము లేక కొండక్రింద నొకకోట కట్టించి దానికిఁ గొండపల్లిగమిడి, నాదేళ్లగమిడి యనురెండుద్వారము లుంచి తగుసైన్యమును కాపుంచి పదునాల్గుసీమలు స్వాధీనము చేసికొనెను. ఈయన ప్రభుత్వకాలమునందు కైతేపల్లి యనుగ్రామము ఉదయగిరి సీమక్రిందను, పరుచూరు అద్దంకిసీమ క్రిందను, కేసానిపల్లె, యమ్మలమంద, మాదల, తొండపి, కోసూరు, జువ్వలకల్లు అను నాఱుగ్రామంబులు బెల్లముకొండ సీమక్రిందను ముసి యనునదికి దక్షిణమందున్న పాకాల, చింగనపల్లి, తుమ్మలపేట, కరేడు అను నాలుగు గ్రామములు కందుకూరు సీమక్రిందను చేర్చంబడెను. కొండవీటిసీమను మట్టుకు హవేలి యను నామముచే నిలిపి, వినుకొండ, బెల్లముకొండ నాగార్జునకొండ సీమలు మూఁటిని పరగణాలుగాఁ జేసి, శేషించిన పదిసీమలు కర్నాటకముక్రింద కలిపివేసిరి. రాయలవారు భూసురులకు ననేకగ్రామములను అగ్రహారములుగా నిచ్చినదేగాక, మున్నంగికి కొల్లిపరగ్రామమునకు మాచెర్ల వారు మహాంకాళి వార్లను మున్నంగికి కేతనభొట్లచారిని, ఈపనికి నగరంవారిని, అతుమూరికి శిష్ఠావారిని, తెనాలికి పిల్లలమఱ్ఱివారిని, సుద్దపల్లికి దంటువారిని పడమటి జొన్నలగడ్డకును పోతవరముకును పానలవారిని యజమాన పెత్తనదార్లనుగా నేర్పర్చెను. సీమలు యావత్తు కర్ణాటకముక్రింద చేరినవెనుక పూర్వమందు రెడ్లవలన యియ్యఁబడిన యగ్రహారములన్నియు నడువవేమో అనుభీతిచే అగ్రహారికులందఱు కృష్ణునివద్ద కేతెంచి ఆయనను మిక్కిలి కొనియాడి, తమమనోభావముల నెఱింగింఁచఁగా నేయ