పుట:Kavijeevithamulu.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

496

కవి జీవితములు.

వేదనను తనయిష్టు లగుకొంతమందికిఁ దెలుపఁగా, స్వామీ మీకోరిక బూరుగవృక్షము వలెనే వున్నదని కొందఱును, అందని మ్రానిపండ్లకు అఱ్ఱుచాఁచుట యుక్తము కాదని కొందఱును, అయ్యా తాము జేయు నుద్యమము పిచ్చుకుంటొకఁ డొకగొప్పమ్రాను కొనయం దుండెడుతేనియ నపేక్షించి పొందఁ బూనుకొనునట్లున్నది. అని మఱికొందఱును ప్రత్యుత్తరములు చెప్పసాగిరి. ఐనను రాజు కొండవీటి సింహాసనమును నాక్రమించుకొనుటయందే యేకాగ్రచిత్తము కలవాఁడై యుండెను. ఒకనాఁ డీరాజు శకునము చూత మని విచారించి ఉపశ్రుతి దేవతను బిలచి, రజకుని గృహముమీఁద శకునానికి అక్షతలు జల్లెను. ఆరజకుఁడు తనలోఁ గాను "కొండవీడు మనదేనా ! కొండపల్లి మనదేనా ! కాదని యెవరు వాదమునకు వచ్చినా కటకందను కామనదేవా!" అని యొకపదముగా బాడెను. ఈవాక్యములు వినఁగా మాయావ్యక్తులయొక్క మంగళవాక్యములు వినినపుడు రాయలవారి మనమునందుఁ పట్టిన యాశ్చర్య సంభ మాతిశయములు పది రెట్లు హెచ్చుగా నుండెను. ఈరాయలు రజకుఁడు చెప్పిన మాటలన్నియు తనవద్ద నమ్మకముగాది దిరుగు చుండెడునొకబ్రాహ్మణునితోఁ జెప్పఁగా నతఁడు మనస్సునందు మితిలేని యుల్లాసముగలవాఁడై రాజుయొక్క యుద్దేశ్యమున కనుకూలముగాఁ గొన్నిమాటలను పలికెను, ఇంతియకాదు ఎట్టి పాపకృత్యము జేసియైనను తనరాజు మనోయభీష్టము తీర్చుట యుక్త మని యెంచి ప్ర్రాణహింసచేయుటవలన తనకుఁ గలుగఁబోవు పాపమునకు వెనుదీయక స్వామీ నాకు కావలసినద్రవ్యసహాయముం జేసితిరా డెబ్బదియిద్దఱుపాలెగాండ్రను హింసించి కొండవీటిసీమకు నిన్ను పట్టాభిషిక్తు'నిఁగా జేసెదను అని రాజుతో ధైర్యముగా నీవిప్రుండుపలికెను. అందుకు రాయలు ఆనందించి కావలసినద్రవ్యము బ్రాహ్మణున కిచ్చివేయుటకు ఖజాన్‌జీకి నుత్తర్వు చేసెను. అంత విప్రుఁడు కొండవీటికిఁ జని అచట మాయోపాయములచేత పాలెగాండ్రను మంచిమాట జేసికొని, ఒకగొప్పదేవాలయము కట్టించి అందు గోపీనాథస్వామి యను నొకశిలాప్రతిమను