పుట:Kavijeevithamulu.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

495

ష్ణరాయధ్వజ,శంఖ, చక్రములఁ గలధ్వజ మెత్తించెను అని యున్నది. అనంతరము కృష్ణరాయలు శ్రీరంగపట్టణము విడచి 1. కొడగు 2. మళయాళము 3. గౌడము మొదలుగాఁగల దేశములకుఁబోయి అచ్చటఁ గప్పముల నందుకొని పాండ్యచోళదేశముల స్వాధీనపఱుచుకొని అట నుండి విజయనగర పట్టణమునకు వచ్చి అచ్చట ననేక సేనలను, పాలెగాండ్రను, అనేకగోత్రములవారిని సిద్ధపఱిచి, మందుగుండుసామానులను, ఆయుధములను సన్నాహపఱుచుకొని యుత్తరదేశపు దండయాత్రకు బయలువెడలెను. ఇట్లు వెడలి కళింగదేశపు రాజును స్నేహితుంగా నొనరించి ఆతని వెంటఁ బెట్టుకొని పోయి హిందూదేశపుమార్గముగా ఘూర్జర మగధ దేశముల జయించి కప్పముం గైకొని అనేకులఁ దురుష్కులం జయించి తిరుగ విజయనగర పట్టణమునకు వచ్చి సింహాసనాధి రోహణముం జేసి, యదుకులోద్భవ రాజమార్తాండ రాజగంభీర మహారాజపూజిత కృష్ణరాయ మహారాయ లని హిమవత్సేతుపర్యంతము బహుకీర్తి నంది సదాశివరాయఁ డనుసేనానాయకునితోఁగూడ రాజ్యరక్షణముం జేయుచు ననేకధర్మముల నడిపెను. అనియును కొంగదేశరాజకాల్ లోనున్నది.

అయితే యీగ్రంథము పశ్చిమసముద్ర తీరవాసులచేత రచియింపఁబడియుండెఁగావున వారికిఁ గర్ణాటకదేశవృత్తాంతము లెస్సగఁ దెలిసి యుండవచ్చును. కాని కృ. రాయని యుత్తరదేశపు దండయాత్రయొక్క విశేషముల నిది విపులముగాఁ జెప్పఁజాల. కృ. రాయని ప్రతాపాదిక ముత్తరదేశమందె విశేషము గావున అట్టి విశేషములం దెల్పుటకు మఱికొన్ని గ్రంథములు చూపివాని న్వివరించెదను. అందు పురుషార్థప్రదాయినిలోని కొండవీటి దండకవిలెలో రెడ్లయొక్క డెబ్బదియి

కొండవీటిఖిల్లాను స్వాధీనముచేసికొనుట.

ద్దఱు పాలెగాండ్రస్థితిని తలఁప దలఁప రాయలవారికి నారాజ్యాధిపత్యము రావలయునని యత్యాశకలుగుచుండెను. ఈయనగారు తనమనో